హర్యానా పోలీసు ఆత్మహత్య కేసులో కీలక పరిణామం..

ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు

హర్యానాలో పోలీస్‌ అధికారుల ఆత్మహత్యల వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటోంది.
ఇటీవల ఐపీఎస్‌ అధికారి పూరన్‌ కుమార్‌ తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఈ ఘటనపై డీజీపీపై కేసు నమోదు చేయగా, సంబంధిత ఎస్పీని తక్షణమే బదిలీ చేశారు.ఇదే ఘటనకు అనుబంధంగా మంగళవారం ఏఎస్‌ఐ సందీప్‌ కుమార్‌ కూడా ఆత్మహత్య చేసుకోవడం మరింత కలకలం రేపింది.ఈ పరిణామాల నేపథ్యంలో పూరన్‌ కుమార్‌ భార్య, ఐఏఎస్‌ అధికారిణి అవ్‌నీత్‌ పీ కుమార్‌, గన్‌మేన్‌ సుశీల్‌, బత్తిండ రూరల్‌ ఎమ్మెల్యే అమిత్‌ రత్నతో పాటు మరో వ్యక్తిపై రోహ్‌తక్‌ సదర్‌ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.

Leave a Comment