విజయ్ దేవరకొండ,నాని, తేజ సజ్జ వీళ్లలో టైర్ వన్ హీరో గ

Vijay Deverakonda Vs Nani: ఎవరు ఎన్ని సినిమాలు చేసిన, వారసత్వంగా ఇండస్ట్రీ కి వచ్చిన సత్తా ఉన్నవాళ్ళు మాత్రమే ఇండస్ట్రీ లో రాణిస్తారు. వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి, ప్రేక్షకులు ఆదరిస్తారు, భారీ సక్సెస్ లను అందుకుంటారు. సినిమా ఒక రంగుల ప్రపంచం…అందులోకి ఎంటర్ అయితే అనుక్షణం పోరాటం చేయాలి… రగులుతున్న సూర్యుడు, రాచుకుంటున్న నిప్పు మాదిరి ఎప్పుడూ ఫైర్ మీదుండాలి. అలాంటప్పుడే విజయాలు వరిస్తాయి… ఇక్కడ హిట్స్ వచ్చిన, ప్లాప్స్ ఎదురైన గుండె ధైర్యంతో ఎదుర్కోవాలి… ప్రస్తుతం విజయ్ దేవరకొండ సైతం యూత్ లో మంచి క్రేజ్ ను ఏర్పాటు చేసుకొని స్టార్ హీరో రేంజ్ లో ముందుకు సాగుతున్నాడు. ఇక అతనితో పాటుగా నాని, తేజ సజ్జ సైతం భారీ సక్సెస్ కోసం స్టార్ ఇమేజ్ ని సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురి మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. ప్రస్తుతం టాప్ హీరోల లిస్టులో ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఇక ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఆడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వీళ్లలో ఎవరు స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేస్తారు. తద్వారా వాళ్ళకంటూ ఒక సక్సెస్ఫుల్ ఇమేజ్ వస్తుంది లేదా అనేది చర్చ నీయంశంగా మారింది… ఈ సంవత్సరం విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తాడు అనుకున్నప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతోనే చాలా వరకు వెనుకబడిపోయాడు.

ఇక ఇప్పుడు నాని సైతం ప్రస్తుతం ‘ప్యారడైజ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ సక్సెస్ సాధిస్తే మాత్రం ఈ సినిమాతో నాని టైర్ వన్ హీరోగా మారిపోతాడు. లేకపోతే ఆయన టాప్ హీరోగా ఎదగడం చాలా కష్టతరమవుతోంది.

ఎందుకంటే యంగ్ హీరోలు 100 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుంటే నాని సినిమాలు సూపర్ సక్సెస్ అవుతున్నా కూడా ఆయన 100 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టడానికి చాలా వరకు ఇబ్బంది పడుతున్నాడు…ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జ సైతం హీరోగా మారి ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

హనుమాన్, మిరాయ్ లాంటి రెండు సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో వందల కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నాడు. పాన్ ఇండియాలో ఆయన స్టార్ హీరోగా మారిపోయాడు… రాబోయే సినిమాలతో కూడా తనదైన రీతిలో సత్తా చాటితే మాత్రం విజయ్ దేవరకొండ నాని కంటే ముందు తనే టైర్ వన్ హీరోగా మారిపోతాడు…

Leave a Comment