వాట్సాప్ లో కొత్త ఫీచర్.. దీంతో ఎంత ఉపయోగమంటే?

New feature in WhatsApp: మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారికి కమ్యూనికేషన్ ఉండడానికి వాట్సాప్ ప్రధాన వాహకంగా నిలుస్తోంది. అయితే వాట్సాప్ లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ వచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటుంది. వాట్సాప్ మాత సంస్థ అయినా మెటా వినియోగదారుల అవసరాలను గుర్తించి వారికి అనుగుణంగా ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ట్రయల్ చేస్తుంది. ఇది స్టేటస్ లకు సంబంధించినది. మరి ఆ ఫీచర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

చాలామంది వాట్సాప్ వచ్చిన తర్వాత తమ పొజిషన్ గురించి స్టేటస్ పెట్టుకోవడం అలవాటుగా మారిపోయింది. కొందరు ఏం చేస్తున్నది? ఎక్కడ ఉన్నది? చెబుతూ వాట్సాప్ లో స్టేటస్ పెడుతూ ఉంటారు. ఈ స్టేటస్ ద్వారా వారి విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. ఈ స్టేటస్ కేవలం కాంటాక్ట్ నెంబర్స్ కు మాత్రమే వెళ్లడంతో వారి దగ్గర వారు వారి పొజిషన్ ను తెలుసుకుంటారు. అయితే ఈ వాట్సాప్ నోటిఫికేషన్ పై సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.

మనం వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న తర్వాత.. మిగతావారు ఎలాంటి స్టేటస్ పెట్టారో చూస్తూ ఉంటాం. అలాగే ఖాళీ సమయాల్లో ఇతరుల స్టేటస్ గమనిస్తూ ఉంటారు. కానీ కొందరు ముఖ్యమైన స్టేటస్ లు పెడుతూ ఉంటారు. ఆ విషయాలు మనకు వెంటనే తెలియవు. ప్రత్యేకంగా స్టేటస్ ఓపెన్ చేస్తే తప్ప వారు ఎలాంటి స్టేటస్ పెట్టారో తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు సులువుగా ముఖ్యమైన వారు స్టేటస్ పెట్టిన విషయాన్ని వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుసుకునే అవకాశాన్ని కొత్త ఫీచర్ కల్పించబోతోంది.

ఇందుకోసం వాట్సాప్ లో ముందుగానే సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. బంధువులు, దగ్గర వారు, ముఖ్యమైన వారి స్టేటస్ చూడాలన్న ఆత్రుత కొందరికి ఉంటుంది. ఇలాంటి వారి స్టేటస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటే ఆ నెంబర్ పక్కన ఉన్న త్రీ డాట్స్ పై క్లిక్ చేయాలి. అప్పుడు get notification అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత ముఖ్యమైన వారు ఎవరైనా స్టేటస్ పెట్టుకున్న వెంటనే నోటిఫికేషన్ లాగా వస్తుంది.

ఇదివరకు యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, ఇతర వెబ్సైట్లో ముఖ్యమైన వార్తలు పెడితే నోటిఫికేషన్ వచ్చేది. అలాగే వాట్సాప్ లో ఏదైనా ముఖ్యమైన మెసేజ్ వచ్చినా కూడా నోటిఫికేషన్ వచ్చేది. కానీ ఇప్పుడు స్టేటస్ లు కూడా నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ముఖ్యంగా వ్యాపారస్తులకు బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. వ్యాపారులు తమ ప్రోడక్ట్ ను ఇతరులకు పరిచయం చేయడానికి ఈ నోటిఫికేషన్ ద్వారా వస్తువు గురించి తెలియజేయడానికి.. తమ వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలుపుతున్నారు.

[

Leave a Comment