రాత్రి నిద్రించే ముందు ఇది తాగుతున్నారా?- OkTelugu

Drink this before Sleep: ఇటీవల కొంతమంది చెబుతున్న మాట ఏంటంటే రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదని.. ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల పనులతో బిజీగా ఉన్నవారు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో సరైన నిద్ర పట్టకుండా ఉంటుంది. అయితే మంచి నిద్ర కోసం కొందరు వ్యసనాల బారిన పడుతూ ఉంటారు. మరికొందరు ఫోన్ చూస్తూ కాలక్షేపం చేసి ఆ తర్వాత నిద్రిస్తారు. ఇలా చేయడం వల్ల మంచి నిద్ర అనేది ఉండదు. ఒకవేళ నిద్ర పోయిన సంతృప్తిగా అనిపించదు. అయితే నిద్రించే ముందు కొన్ని ఆరోగ్యకరమైన పనులు చేయడం వల్ల మంచి నిద్ర రావడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అలా ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి పూట ఏం చేయాలంటే?

చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకుంటారు. మరికొందరు కుటుంబ సభ్యులతో సరదాగా ఉండి ఆ తర్వాత నిద్రిస్తారు. అయితే రాత్రి పడుకునే ముందు పాలు తీసుకునే అలవాటు ఉంటుంది కొందరికి. రాత్రి పాలు తీసుకుని నిద్రించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పాలలో కాల్షియం ఉంటుంది. అంతేకాకుండా నిద్రించే ముందు పాలు తాగడం వల్ల నిద్ర మత్తుగా వస్తుంది. అయితే పాలలో ఉండే కొన్ని రకాల పదార్థాల వల్ల జీర్ణక్రియ సమస్య ఉండే అవకాశం ఉంది. మిగతా ఆహార పదార్థాల కంటే పాలు త్వరగా జీర్ణం కావు. దీంతో పాలు తాగిన వెంటనే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇలాంటి సమయంలో రాత్రి నిద్రించే ముందు పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పాలల్లో పసుపు కలుపుకొని తాగడం వల్ల అదనపు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉంటాయని అంటున్నారు. పసుపు వేసిన పాలు తాగడం వల్ల దాడి వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. దీంతో మనసు ప్రశాంతమైన మంచి నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఇలా చేయడం వల్ల పరిష్కారం అవుతుంది. పాలలో ఉండే కాల్షియానికి తోడుగా పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం తోడవడంతో యాంటీ ఆక్సిడెంట్ గా మారుతుంది. దీంతో శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి రోగనిరోధక శక్తి పెరగడం వల్ల జలుబు, దగ్గు రాకుండా కాపాడుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారు సైతం రాత్రి నిద్రించే ముందు పాలల్లో పసుపు కలుపుకొని తాగడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.

కొంతమందికి పాలలో పసుపు వేసుకొని తాగడం ఇష్టం ఉండదు. అయితే కాస్త రుచి కోసం ఇందులో చక్కెరకు బదులు బెల్లం వేసుకొని తాగాలి. అంతేకాకుండా ఇందులో చిటికెడు మిర్యాల పొడి వేయడం వల్ల గొంతు సమస్యలు పరిష్కారం అవుతాయి. వీలైతే ఇందులో తేనె వేసుకొని కూడా తాగవచ్చు. ఈ మిశ్రమం వల్ల రుచితో పాటు ఆరోగ్యకరమైన ద్రవం ఏర్పడి శరీరానికి అదనపు శక్తి చేకూరుతుంది.

[

Leave a Comment