'మిత్ర మండలి' మూవీ ట్విట్టర్ టాక్..ఎదో అనుకుంటే..ఇంకేదో అయ్యింది..హిట్టా..? ఫట్టా?

'మిత్ర మండలి' మూవీ ట్విట్టర్ టాక్..ఎదో అనుకుంటే..ఇంకేదో అయ్యింది..హిట్టా..? ఫట్టా?

Mithra Mandali Twitter Talk: వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాత బన్నీ వాసు,తొలిసారి గీత ఆర్ట్స్ నుండి బయటకు వచ్చి తీసిన చిత్రం ‘మిత్ర మండలి'(Mithra Mandali). నేడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది. ప్రస్తుతం టాలీవుడ్ మంచి ట్రెండింగ్ లో ఉన్న ప్రియదర్శి, విష్ణు,రాగ్ మయూర్, సత్య మరియు వెన్నెల కిషోర్ వంటి వారు ఈ చిత్రం లో నటించారు. వీరితో పాటు సోషల్ మీడియా లో టాప్ సెలబ్రిటీ గా యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నిహారిక కూడా ఈ చిత్రంలో నటించింది. టీజర్, ట్రైలర్ వంటివి కూడా ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించింది. మరో జాతి రత్నాలు లాంటి సినిమాని చూడబోతున్నాము అనే ఫీలింగ్ ని విడుదలకు ముందే కలిగించింది ఈ చిత్రం. అలా ప్రామిసింగ్ మూవీ గా అనిపించడం తో ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా డీసెంట్ గా జరిగాయి.

నిర్మాత బన్నీ వాసు కూడా చాలా కాన్ఫిడెంట్ తో నిన్న రాత్రి కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాల్లో ప్రీమియర్ షోస్ వేయించాడు. ఈ ప్రీమియర్స్ నుండి వచ్చిన టాక్ ని చూసి నెటిజెన్స్ షాక్ కి గురయ్యారు. ఏంటి సినిమా ఇంత చెత్తగా ఉందా అంటూ ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ఎలాంటి స్టోరీ లైన్ కానీ, ప్లాట్ కానీ లేదని, సినిమాలో మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా, డైరెక్టర్ పేలవమైన టేకింగ్ కారణంగా ఎలాంటి ప్రభావం ఔట్పుట్ పై చూపించలేకపోయారని, కమెడియన్ సత్య కామెడీ ఉన్నంత కాస్త బాగుందని, ఆయన ఒక్కటే ఈ సినిమాకు హైలైట్ అని చెప్పుకొచ్చారు. డైరెక్టర్ రాసుకున్న కామెడీ సన్నివేశాలు ఆడియన్స్ ని నవ్వించడం తో తీవ్రంగా విఫలం అయ్యాయి అని, కొన్ని వన్ లైనర్ డైలాగ్స్ బాగున్నాయి కానీ, అవి సరైన సమయం, సందర్భం లో రాకపోవడం వల్ల ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి అని చెప్పుకొచ్చారు.

ఓవరాల్ గా ఈ సినిమా థియేటర్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని మంచి సన్నివేశాలు అయినా చూసాము అనే ఫీలింగ్ కలగదని, చాలా తేలికగా ఈ చిత్రాన్ని మర్చిపోవచ్చని అంటున్నారు. ప్రముఖ రివ్యూయర్స్ అందరూ కూడా ఈ చిత్రానికి రేటింగ్స్ కనీసం 2 కూడా ఇవ్వలేకపోయారు. ఈమధ్య కాలం లో ఒక ఎంటర్టైనర్ కి ఇంతటి దారుణమైన రేటింగ్స్ రావడం ఎప్పుడూ జరగలేదు. చూస్తుంటే దీపావళి పోటీ లో ఈ చిత్రానికి థియేటర్స్ దొరకడం చాలా కష్టమే. పాత సినిమాలు అయినటువంటి ఓజీ, కాంతారా చిత్రాలను బయ్యర్స్ ఈ సినిమాకు బదులుగా థియేటర్స్ లో కొనసాగించే అవకాశం ఉంది. ట్విట్టర్ లో వచ్చిన రివ్యూస్ కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Leave a Comment