మహిళలు అసలు దేంతో సంతోషంగా ఉంటారో తెలుసా?

మహిళలు అసలు దేంతో సంతోషంగా ఉంటారో తెలుసా?

Women Happy: మనం ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ఆహారం తయారు కావాలంటే వంట చేసుకోవాలి. ఒక కుటుంబంలో మహిళలు ఎక్కువగా వంట చేస్తారు. బ్యాచిలర్ లైఫ్ ఉంటే ఎవరికి వారే వంట చేసుకొని ఆహారం తయారు చేసుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో మహిళలు సైతం ఉద్యోగం చేయడంతో వారు వంట చేయడం లేదు. పని మనుషులు లేదా ఇతరుల సేవకుల సహాయంతో వంటతో పాటు ఇతర పనులను కూడా చేయడం. అయితే ఉద్యోగం చేయని వారు సైతం వంట చేయడానికి ఇష్టపడడం లేదట. వంట చేయడం వల్ల తమ వైవాహిక జీవితానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఓ సర్వేలో తెలిపారు. ఆ సర్వే ప్రకారం..

Harward Business School చేసిన సర్వే ప్రకారం వంట చేయకపోవడం వల్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామని కొంతమంది మహిళలు తెలిపారట. 15 ఏళ్ల పాటు 22 దేశాలకు చెందిన విదేశీ జంటలపై సర్వే చేశారు. ఈ సర్వేలో 10 మార్కులు ఏర్పాటు చేయగా ఇందులో వంట చేయడానికి ఇష్టపడేవారు 6.1 ఒప్పుకోగా.. 8.4 మార్కులు వంట చేయనివారు వేశారు. అంటే తాము వంట చేయకుండా ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటామని.. ముఖ్యంగా వైవాహిక జీవితానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయని భావిస్తున్నారు.

సాధారణంగా ప్రతి ఇంట్లో మహిళలు వంట చేస్తుంటారు. వీరికి ఈ వంట చేయడం వల్ల ఎంతో కష్టం కలుగుతుంది. అయితే ఇలా వంట చేయడం వల్ల వారి ప్రియమైన వారితో ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నారట. అంతేకాకుండా వంట చేసే సమయంలో వారు పడే కష్టం.. ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి సమయం గడిచిపోతుందట. ముఖ్యంగా వంట చేసేవారు తమ భాగస్వామితో సంతోషంగా లేమని పేర్కొంటున్నారు. అదే వంట చేయని వారు తమ జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. వంట చేయకుండా ఇతరులను నియమించుకోవడం… లేదా బయట నుంచి తెచ్చే ఆహారాన్ని తినడం వల్ల వీరు హ్యాపీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు సర్వే పేర్కొంటుంది.

కానీ చాలా కుటుంబాల్లో ఇది సాధ్యమయ్యే పని కాదని కొందరు కొట్టి పారేస్తున్నారు. ఎందుకంటే మహిళలు మాత్రమే రుచికరమైన వంట వండుతారని.. బయట దొరికే ఆహారం ఏమాత్రం రుచిగా ఉండాలని అంటున్నారు. అంతేకాకుండా వంట చేయడం వల్ల ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుందని.. ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి వారికి సరైన ఆహారాన్ని అందించడమే ప్రధానమని మరికొందరు చెబుతున్నారు.

అయితే కొందరు నిపుణులు తెలుపుతున్న ప్రకారం వంట చేయకపోవడం వల్ల వారు సంతోషంగా ఉన్నారని కాదని.. సంతోషమైన జీవితాన్ని కోరుకునే వారు వంట చేయకుండా ఇతరులను నియమించుకోవాలని.. లేదా బయట ఆహారాన్ని తెప్పించుకోవాలని అంటున్నారు. ఎందుకంటే వంట చేసే సమయాన్ని వారు కొనుక్కున్నట్లు భావిస్తున్నారని.. ఈ వంటకు కేటాయించిన సమయాన్ని తమ జీవిత భాగస్వామి కేటాయించడం వల్ల వారి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు.

[

Leave a Comment