హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ జరగనుంది. అక్టోబర్ 19న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభంకానుంది. మూడు వన్డేలు, ఐదు టి20లు రెండు మధ్య జరుగనున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సృష్టించనున్నాడు. అంతర్జాతీయంగా రోహిత్ 500వ మ్యాచ్ ఆడనున్నాడు. టీమిండియా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లో సచిన్ టెండూల్కర్(664) ముందువరసలో ఉండగా తరువాత వరసగా విరాట్ కోహ్లీ(550), ఎంఎల్ ధోనీ(535), రాహుల్ ద్రవిడ్(504) ఉన్నారు. ప్రస్తుతం రోహిత్ 499 మ్యాచ్‌లు ఆడాడు. రోహిత్ 273 వన్డేలు, 159 టి20లు, 67 టెస్టులు ఆడాడు.
వన్డేలకు భారత జట్టు: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అక్షర పటేల్, కెఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, సిరాజ్, అర్షదీప్, ప్రసిద్ధ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్(కీపర్), కుల్‌దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్