‘లవ్ టుడే, డ్రాగన్’ వంటి రెండు వరుస హిట్‌లను అందించిన హీరో ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా నేడు (శుక్రవారం) తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ, ‘హైదరాబాద్ నాకు ఇంకో ఫ్యామిలీ. నా సినిమాలన్నీ గొప్పగా ఆదరించారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ కుటుంబంలో ఒకరిగా చూసినందుకు చాలా థ్యాంక్స్. ‘లవ్ టుడే, డ్రాగన్’ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ‘డ్యూడ్’ కూడా నచ్చుతుంది. అదిరిపోయే సినిమా ఇది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మైత్రి మూవీ మేకర్స్‌కి థ్యాంక్స్. నాకు తెలుగులో ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవ్వాలని ఉంటుంది.
ఇది నాకు మంచి అవకాశం. మైత్రి మూవీ మేకర్స్ చాలా అద్భుతంగా పే చేస్తారు. ఈ సినిమా కోసం చాలా మంచి పేమెంట్స్ తీసుకున్నాను.(నవ్వుతూ)డైరెక్టర్ కీర్తికి థాంక్యూ. చాలా మంచి సినిమా తీశాడు. సినిమా చూసిన తర్వాత అతను ఎంత పెద్ద డైరెక్టర్ అవుతారో మీరే చెప్తారు. సాయి చాలా పెద్ద కంపోజర్ అవుతాడు. ఇప్పటికే తనకి చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. మమితకి అద్భుతమైన ఎనర్జీతో నటించింది. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు. హీరోయిన్ మమిత బైజు, డైరెక్టర్ కీర్తి ఈశ్వరన్, డైరెక్టర్ హను రాఘవపూడి, డైరెక్టర్ బుచ్చిబాబు సాన, డైరెక్టర్ సాయి రాజేష్, డైరెక్టర్ రాహుల్ సాంకత్యన్ , డైరెక్టర్ మహేష్, డైరెక్టర్ శివ నిర్వాణ, నిర్మాత రవిశంకర్, నిర్మాత నవీన్ ఎర్నేని, గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి, మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్, డిఓపి నిఖిత్ బొమ్మి తదితరులు ఈ వేడుకలో పాల్గొని, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
The post మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ appeared first on Navatelangana.