Akira Nandan craze: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కొడుకు అకిరా నందన్(Akira Nandan) ఇండస్ట్రీ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో తెలియదు కానీ, ఎంట్రీ ఇచ్చిన రోజు మాత్రం పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఈమధ్య కాలం లో తన తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి అనేక ఈవెంట్స్ లో పాల్గొనడం తో పాటు, టూర్లకు వెళ్లడం వంటివి జరిగాయి. అంతే కాకుండా ఓజీ మూవీ విడుదల సమయంలో థియేటర్స్ లో కూడా కనిపించాడు. ఇలా సోషల్ మీడియా లో యాక్టీవ్ గా లేకపోయినప్పటికీ, ఇలా పలు సందర్భాల్లో బయటకు వచ్చిన వీడియోలు, ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ ఫోటోలను ఉపయోగించి బ్యానర్స్ వేయడం, కటౌట్స్ ఏర్పాటు చేయడం వంటివి చేశారు. అలా వెండితెర అరంగేట్రం చేయకముందే పవన్ ఫ్యాన్స్ ని మాత్రమే కాదు, యావత్తు సినీ లోకాన్ని ఆకర్షించాడు.
రీసెంట్ గా ఒక అమ్మాయి అయితే అకిరా నందన్ పై బీచ్ ఒడ్డున చేసిన ఒక కవర్ సాంగ్ సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేసింది. అతని ఫోటోలను బీచ్ నదిఒడ్డున ప్లకార్డులు లాగా ప్రదర్శిస్తూ, అకిరా ని స్మరిస్తూ చేసిన ఈ వీడియో ని చూసి, ఎంట్రీ ఇవ్వకముందే ఇలా ఉంది, ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మాయిలందరూ అకిరా కి వీరాభిమానులు అయిపోతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఆ వీడియో ని మీ కోసం క్రింద అందిస్తున్నాము, చూసి ఎంజాయ్ చేయండి. అసలు అకిరా సినిమాల్లోకి వస్తాడా లేదా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. అతని అమ్మ రేణు దేశాయ్ అకిరా కి ఆసక్తి లేదు అంటూ పలు మార్లు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపింది. అయినప్పటికీ కూడా అకిరా కి ఇంతటి క్రేజ్ ఏర్పడడం సామాన్యమైన విషయం కాదు.