నైరుతి తిరోగమనం.. ఈశాన్యపు ఆగమనంఆ జిల్లాలకు భారీ వర్ష సూచన – Telugu News | AP, Telangana Weather Alert Heavy Rains Expected as Northeast Monsoon Arrives video TV9D

ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా తమిళనాడు, కర్ణాటక, కేరళ పాండిచ్చేరిలో ప్రభావం చూపించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-45కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని సమాచారం.మరోవైపు తెలంగాణ లోని నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది. అలాగే మరి కొన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. కాగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల సమయంలో వాగులు, చెరువులు, కాల్వల దగ్గరికి వెళ్లరాదని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాక్‌ సైనికుల ప్యాంట్లు ఊడగొట్టాం.. ఇదిగో సాక్ష్యం.. తాలిబన్ల వీధి ప్రదర్శన

భారత్‌లోనే 2030 కామన్వెల్త్ గేమ్స్… నవంబరు 26నే అధికారిక ప్రకటన

ఆలయ ప్రాంగణంలో వింత ఆకారం.. విద్యుత్‌ కాంతుల మధ్య ధగధగా మెరుస్తూ

ఆరు పదుల వయసులోనూ గుర్రంపై సవారీ.. అదుర్స్‌

కోతి చేతిలో నోట్ల కట్టలు.. చెట్టెక్కి చెలరేగిపోయిన వానరం

Leave a Comment