నువ్వులలో పీచు పదార్థం ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను అందిస్తుంది. పేగు పనితీరుకు మద్దతు ఇస్తుంది. మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నువ్వుల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు లిగ్నన్స్, ఫైటోస్టెరోల్స్ వంటి మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నువ్వుల గింజల్లో ఉండే మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి ఆరోగ్యకరమైన కొవ్వులును ప్రోటీన్ అధికంగా ఉండే నువ్వులు అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ఇవి చక్కెర పెరుగుదలను తగ్గిస్తాయి.
విటమిన్ ఇ, ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని, జుట్టుకు పోషణ ఇస్తాయి. వాటిని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి. నువ్వుల గింజల్లోని ఫైటోఈస్ట్రోజెన్లు మహిళల్లో రుతుక్రమం ఆగిపోయిన లక్షణాలను తగ్గించడంలో సహాయపడవచ్చు. హార్మోన్ల సమతుల్యతను ఇది కాపాడుతుంది. థైరాయిడ్ పనితీరుకైసెలీనియం, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల నువ్వులు థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి, మొత్తం థైరాయిడ్ ఆరోగ్యానికి సహాయపడతాయి.
ఇవి కూడా చదవండి
నువ్వుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు, ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నువ్వుల్లో ఐరన్, రాగి, విటమిన్ బి6 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి హెల్ప్ చేస్తుంది. నువ్వుల గింజల్లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, అకాల వృద్ధాప్యం నుంచి దూరం చేస్తాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
[