Diwali Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక మరి కొంతమంది హీరోలు మాత్రం వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల భారీ ప్లాపులను మూట గట్టుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇకమీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది… ప్రస్తుతం యంగ్ హీరోలు దీవాలి పోటీలో ఉండడం నిజంగా ఒక శుభ పరిణామం అనే చెప్పాలి. ఇక దసర కి వచ్చిన సినిమాల టిక్కెట్ల రేట్లు భారీగా పెంచారు. కానీ దీపావళి విషయంలో మాత్రం టికెట్ రేట్లు నార్మల్గానే ఉన్నాయి. దానివల్ల ప్రతి ఒక్కరు ఆ సినిమాని చూసి సినిమాలను విజయ్ తీరాలకు చేరుస్తారని ఒక పాజిటివ్ మూమెంట్ తో ముందుకు సాగుతున్నారు.
ఇక ఈ దీపావళి కి సిద్దు జొన్నల గడ్డ చేసిన తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్, ప్రియదర్శి మెయిన్ లీడ్ లో వచ్చిన మిత్రమండలి, కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న ‘కే ర్యాంప్’ సినిమాలన్నీ వస్తున్నాయి. ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే టికెట్ల రేట్లు నార్మల్ గా ఉండడం అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగలేదు.
ఈ దీపావళి కి టికెట్ రేట్లు అందుబాటులో ఉండటమే కాకుండా ప్రతి ఒక్కరు సినిమాని చూసి ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమాలు ఉంటాయని సినిమా మేకర్స్ సైతం కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఇక వీటిలో ఏ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. ఏ సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది తెలియాలంటే మరికొన్ని గంటల పాటు వెయిట్ చేయాల్సిందే…
ఇక మీదట రాబోయే సినిమాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచి సినిమాలు వస్తాయి. అలాగే ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే సినిమాలు వచ్చిన ప్రతిసారి వాళ్ళు సినిమాలలో ఆదరిస్తూ వస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి టిక్కెట్ రేట్ పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్ కి రావడం లేదనే వార్తలైతే వస్తున్నాయి. కానీ ఇప్పుడు టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో ఉండటంతో సగటు ప్రేక్షకులు వల్ల ఫ్యామిలీ తో వెళ్ళి ఈ పండగను చాలా బాగా ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి…