దీపావళి రోజున 10-15 నిమిషాల్లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 1 గ్రాము బంగారం నుండి 1 కిలో వెండిని మీ ఇంటి వద్దకే డెలివరీ చేయనుంది. ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండియాలో వాణిజ్యం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఈ చర్య నిదర్శంగా నిలుస్తుంది. ఫోన్లో ఆర్డర్ చేస్తే చాలు పది నిమిషాల్లో స్వచ్ఛమైన బంగారం మన ఇంటికే వచ్చేస్తుంది. స్విగ్గీ లిమిటెడ్ క్విక్-కామర్స్ యూనిట్, కళ్యాణ్ జ్యువెలర్స్ లిమిటెడ్, మలబార్ గోల్డ్, ‘మియా బై తనిష్క్’ వంటి సంస్థలతో టై అప్ అయి పవిత్రమైన రోజున బంగారు నాణేలు, వెండి నాణేలు, బార్లను ఇంటికే డెలవరీ చేస్తోంది.
వినియోగదారులు 1 గ్రాము నుండి 10 గ్రాముల వరకు బరువున్న బంగారాన్ని, అలాగే 1 కిలో వెండి బిస్కెట్‌ను ఆర్డర్ చేయవచ్చు. అన్ని బంగారు నాణేలు 999 హాల్‌మార్క్‌ను కలిగి ఉంటాయి. ఎటువంటి తయారీ ఛార్జీలు ఉండవు, అయితే వెండి నాణేలు స్వచ్ఛతతో ధృవీకరించబడతాయి. ధన్‌తేరాస్‌లో 1 గ్రాము లేదా అంతకంటే ఎక్కువ బంగారు నాణేలను కొనుగోలు చేసే మొదటి 10,000 మంది కస్టమర్లకు రూ.100 తగ్గింపు లభిస్తుంది. బంగారం, వెండి డెలివరీ అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ NCR, హైదరాబాద్, ముంబైలతో సహా కీలకమైన మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం చేశారు. ధన్‌తేరస్ రోజున ఉదయం 7:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు ఆర్డర్లు చేయవచ్చు.
కాగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఇంటి వద్దకే బంగారం, వెండి డెలివరీ చేయడం ఇదే మొదటిసారి కాదు. అక్షయ తృతీయ, ధంతేరాస్ సందర్భంగా డిమాండ్ పెరగడంతో క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో బంగారం, వెండికి డిమాండ్ స్థిరంగా పెరిగింది. 1 గ్రాముల బంగారు నాణెం ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన విలువ కలిగిన నాణెం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి