
న్యూఢిల్లీ : భారతదేశపు సెమీహైస్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షన్ రానుంది. వందే భారత్ 4.0 ను అభివృద్ధి చేయనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దాని రూపకల్పన ఉంటుందని వెల్లడించారు. రైళ్ల ఆధునిక సాంకేతికత విషయంలో దేశాన్ని గ్లోబల్ సప్లయిర్‌గా మార్చే దిశగా ఇది కీలక అడుగు కానుందని వెల్లడించారు. సీఐఐ ఇంటర్నేషనల్ రైల్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి మాట్లాడారు.
మోడీ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధిపై బలంగా దృష్టి సాధించిందని వెల్లడించారు. 11 ఏళ్లలో 35,000 కిలో మీటర్ల మేర రైల్వే ట్రాక్‌ల నిర్మాణం జరిగిందని చెప్పారు. జపాన్ బుల్లెట్ రైల్ నెట్‌వర్క్ మాదిరిగానే హైస్పీడ్ ప్యాసింజర్ రైల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు చెప్పారు. గరిష్ఠంగా గంటకు 350 కిమీ వేగంతో రైలు ప్రయాణించేలా వాటి డిజైన్ ఉంటుందని తెలిపారు.