త్రివిక్రమ్, బాలకృష్ణ కాంబినేషన్ లో మిస్ అయిన

Trivikram And Balakrishna Combination: త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas), విజయ్ భాస్కర్ కాంబినేషన్ ఆ రోజుల్లో ఒక సెన్సేషన్. వీళ్లిద్దరి కలయిక లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, నువ్వే కావాలి, మల్లీశ్వరి, స్వయంవరం, మన్మధుడు, ఇలా ఒక్కటా రెండా, చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవ్వడమే కాకుండా, ఇండస్ట్రీ లోనే ఆల్ టైం క్లాసిక్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాలను ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టదు. చూసే కొద్దీ చూడాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి మ్యాజికల్ కాంబినేషన్ ఇది. సీనియర్ హీరోలలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో సినిమాలు చేశారు కానీ, నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తో మాత్రం సినిమా చేయలేకపోయారు. వీళ్లిద్దరి కామెడీ టైమింగ్, జానర్ బాలయ్య కి సూట్ అవ్వడం కష్టం అని మీరంతా అనుకోవచ్చు, కానీ వీళ్ళ కాంబినేషన్ లో అప్పట్లో ఒక సినిమా చేసే ప్రయత్నం జరిగింది అనే విషయం చాలా మందికి తెలియదు.

రీసెంట్ గా విజయ్ భాస్కర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘బాలకృష్ణ, బి గోపాల్ దర్శకత్వం లో వచ్చిన లారీ డ్రైవర్ చిత్రానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాను. బాలయ్య గారు సెట్స్ లో మా అందరితో చాలా సరదాగా ఉండేవాడు. ముఖ్యంగా నా పని తీరు ఆయనకు బాగా నచ్చేది. మా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే బాలయ్య గారి నారి నారి నడుమ మురారి చిత్రం విడుదలైంది. బాలయ్య లోని కామెడీ టైమింగ్, రొమాంటిక్ యాంగిల్ ని చూపిస్తూ తెరకెక్కించిన ఆ సినిమా నాకు తెగ నచ్చేసింది. పాటలు కూడా బాగా నచ్చాయి. ఈ విషయాన్ని నేను బాలయ్య గారికి సెట్స్ లో ఒకరోజు చెప్పుకున్నాను. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నాకు ‘ప్రార్థన’ అనే చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది’.

‘బి గోపాల్ గారి అనుమతి తీసుకొని ఆ చిత్రానికి దర్శకత్వం వహించాను. చాలా తక్కువ రోజుల్లోనే పూర్తి చేసాను. సినిమా పూర్తి అయ్యాక లారీ డ్రైవర్ సెట్స్ కి వచ్చిన నేను, బాలయ్య గారిని నేను దర్శకత్వం వహించిన సినిమాని చూడాల్సిందిగా కోరాను. ఇంత తొందరగా సినిమాని తెరకెక్కించావా అని బాలయ్య గారు ఆశ్చర్యపోయారు. చెన్నైలో ఆయనకు, ఆయన కుటుంబానికి కలిపి ఒక ప్రైవేట్ స్క్రీనింగ్ ద్వారా ఆ సినిమాని చూపించాను. చాలా బాగా తీసావు, మరో పది లక్షలు ఖర్చు చేసి ఉండుంటే వేరే లెవెల్ లో ఉండేది అని బాలయ్య గారు చెప్పారు. అయితే నేను డైరెక్టర్ గా ఒక స్థాయికి వచ్చిన తర్వాత స్వయంగా బాలయ్య గారు నాకు ఫోన్ చేసి సినిమా చేద్దామని అన్నారు. బాలయ్య తో సినిమా చేసే అవకాశం రావడంతో నేను,త్రివిక్రమ్ ఎగిరి గంతులేశాము. కానీ ఆ సమయంలో నేను మల్లీశ్వరి సినిమాకు కమిట్ అయ్యి ఉన్నాను. ఆ చిత్రం తర్వాత మరో సినిమా కి కూడా కమిట్మెంట్ జరిగింది. ఈ గ్యాప్ లో బాలయ్య అల్లరి పిడుగు సినిమా చేసాడు, అలా మా కాంబినేషన్ మిస్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ భాస్కర్.

Leave a Comment