జపాన్‌ను వణికిస్తున్న మహమ్మారి.. ఆసియా అంతటా హై అలర్ట్‌ – Telugu News | Japan Flu Epidemic: Health Emergency Declared Amid Rising H3N2 Cases video TV9D – World Videos in Telugu

ఏటా ఈ సీజన్‌లో జపాన్‌లో ఫ్లూ వ్యాపించడం మామూలే అయినా.. ఈ ఏడాది ఐదు వారాల ముందుగానే వ్యాపించింది. ఇది..క్రమంగా పక్క దేశాలకు వ్యాపిస్తుందనే ఆందోళన నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పౌరులను కోరింది. దీనిని సీజనల్ ఫ్లూ అని చెబుతూనే.. దాని తీవ్రత కారణంగా ఇది పలు దేశాలకు పాకే ప్రమాదముందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. దీని ప్రభావం వల్ల ఈ శీతాకాలంలో వేలాది మంది శ్వాసకోశ వ్యాధుల పాలయ్యే ప్రమాదం ఉందని వారు సూచిస్తున్నారు. ఇప్పటికే జపాన్‌లో ఇన్‌ఫ్లూయెంజా కేసులు సంఖ్య భారీగా పెరిగాయి. టోక్యో, ఒకినావా, కగోషిమాలో మరిన్ని కేసులు వెలుగు చూశాయి. పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు తాత్కాలికంగా మూసివేశారు. జపాన్ లో ఫ్లూ వైరస్ అడ్వాన్స్ డ్ పద్ధతితో దూసుకెళ్తోంది. నార్త్, ఈస్ట్రర్న్ ప్రాంతాల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ వైరస్ లక్షణాలు అధికమైన దగ్గు, ఊపిరి ఆడకపోవడం, అధిక ఉష్ణోగ్రతగా ఉన్నాయి. జపాన్ లో ప్రస్తుతం శీతాకాలం కావడంతో ఫ్లూ కేసులు అధికం అవుతున్నాయి. ప్రస్తుతం వ్యాపిస్తున్న ఫ్లూ వైరస్ మునుపటి కంటే శక్తివంతమైనదని చెబుతున్నారు. వాతావరణంలో మార్పులు కూడా వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. వెంటనే టీకాలు వేయకపోవటంతో.. ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతోంది. సీజనల్ ఇన్ఫ్లుయెంజా H3N2 అనే వైరస్ వల్ల వస్తుందని, అయితే.. ఇది మహమ్మారిలా మారే ప్రమాదం లేదంటున్నారు నిపుణులు. నిరంతర పర్యవేక్షణ, టీకాలు వేయడం చాలా అవసరమని. వృద్ధులు, పిల్లలు, ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు టీకాలు వేయించుకోవాలని వైద్యులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక.. సులభంగా ఈపీఎఫ్‌ విత్‌ డ్రా.. ఎమర్జెన్సీలో 100 శాతం తీసుకోవచ్చు

ఆదరణకు నోచుకోని ఆదుర్రు స్తూపం

వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. చలాన్లు 45 రోజుల్లోపు చెల్లించాలి

ఫోటో పెట్టు.. రూ.1000 పట్టు

రూ.18 లక్షల బాహుబలి గుమ్మడి.. బరువు 1064 కేజీలు

Leave a Comment