
వాషింగ్టన్, న్యూఢిల్లీ: భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోదని ప్రధాని నరేంద్రమోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా ప్రెసిడెం ట్ డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ట్రంప్ వా దనను భారత ప్రభుత్వం విర్ద్వంద్వంగా ఖండించింది. రష్యా చమురు కొనుగోలుకు సంబంధించి డోనాల్డ్ ట్రంప్, నరేంద్రమోదీ మధ్య ఫోన్ సంభాషణే జరగలేదని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలుపై ట్రంప్ చేసిన ప్రకటనపై జైస్వాల్ మాట్లాడుతూ, అసలు ఇద్దరి మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగినట్లే తెలియదని పేర్కొన్నారు. అంతకుముందు విదేశాంగ మంత్రి త్వ శాఖ ఒక ప్రకటనలో భారత ఇంధన అవసరా లు, దిగుమతులు భారత వినియోగదారు ల ప్ర యోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్వహించుకుంటుందని పేర్కొన్నది. భారతదేశం చమురు, గ్యాస్ అవసరాలు దిగుమతులపైనే ఆధారపడి ఉం టుందని, అస్థిర ఇందన పరిస్థితిలో భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను
కాపాడడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. మా దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్యంతోనే ఉంటాయని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి జైస్వాల్ తెలిపారు. కాగా, ట్రంప్ వైట్‌హౌస్‌లో బుధవారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ రష్యా నుంచి భారతదేశం చమురు కొనుగోలు చేయడం పట్ల తాను సంతోషంగా లేనని, అయితే తాము రష్యానుంచి చమురు కొనుగోలు చేయబోమని మోదీ తనకు ఈ రోజు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రష్యాను ఆర్థికంగా ఏకాకిని చేయడంలో ఇదే గొప్ప చర్యగా ఆయన పేర్కొన్నారు. కాగా మోడీ ట్రంప్‌కు అలాంటి హామీ ఇచ్చారా అన్న ఈ మెయిల్ ప్రశ్నలకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్పందించలేదు. కొద్ది నెలలుగా రష్యా నుంచి భారతదేశం చమురు కొనుగోలు చేయడం ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలోచర్చనీయాంశం అయింది. ఇదే సాకు చూపి ట్రంప్ భారతదేశం ఉత్పత్తులపై మొదట 25 శాతం సుంకం విధించి, అదనంగా మరో 25శాతం సుంకాలను విధించారు. మొత్తం భారతీయ ఉత్పత్తులపై సుంకాలు 50 శాతానికి చేరాయి.
భారత్‌లో యేటా ఓ కొత్త ప్రధాని.. నోరుజారిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతి సంవత్సరం భారతదేశానికి కొత్త ప్రధాని వస్తారని భావిస్తున్నారా.. పొరపాట్లు మాట్లాడడం నాలుక కరచుకోవడం మామూలే కదా. ట్రంప్ ట్రేడ్ మార్క్ మాటల పొరపాటును సోషల్ మీడియా ప్రముఖంగా పేర్కొంది. ట్రంప్ వైట్ హౌస్ లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తాను చాలాకాలంగా భారతదేశాన్ని చూస్తున్నానని, ప్రతి సంవత్సరం కొత్తనాయకుడు వస్తాడని, కొందరు నాయకులు కొన్ని నెలలు ఉంటారని, అయితే మోదీ మాత్రం చాలా కాలంగా అక్కడ ఉన్నారని అన్నారు. భారత దేశం, పాకిస్తాన్ ల చరిత్ర విషయంలో పొరపడిన ట్రంప్ భారతదేశాన్ని పొరుగున ఉన్న పాకిస్తాన్ ను ఒకే గాటిన కట్టినట్లు కన్పిస్తోంది. భారతదేశంలో 2014 నుంచి నరేంద్రమోదీ ఏ ప్రధానిగా కొనసాగుతున్నారు. అంతకు ముందు ప్రధాని గా మన్మోహన్ సింగ్ అవిచ్ఛిన్నంగా పదేళ్ల పాటు పదవిలో కొనసాగారు. పాకిస్తాన్ లో 77 ఏళ్లుగా తరచు ప్రధానులు, పాలకులు మారే చరిత్ర ఉంది. అయితే , ట్రంప్ మాటలు పాకిస్తాన్ కే ఖచ్చితంగా వర్తిస్తాయి.