Intelligence: ఈ భూమి మీద ఎంతోమంది మనుషులు ఉన్నారు. కానీ కొందరు మాత్రమే విజేతగా నిలుస్తున్నారు. మిగతావారు వారికి చప్పట్లు కొడుతున్నారు. అయితే చప్పట్లు కొట్టే వాళ్ళలో కొందరు అనుకుంటారు.. అసలు తామెందుకు విజేతలు కాలేదు అని.. అంతేకాకుండా ఇద్దరు స్నేహితులే ఉంటే వారిలో ఒకరు మాత్రమే ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. మరొకరు ఎంతో కష్టపడినా కూడా ఆ స్థాయికి వెళ్లరు. అందుకు ఇద్దరి మనస్తత్వాల్లో ఉన్న ఆలోచనల్లో తేడా మాత్రమే. ఆ తేడా వలన ఒకరు ఎప్పటికీ కష్టపడుతూనే ఉంటారు.. మరొకరు మాత్రం తన తెలివితో పనులను సులభంగా చేస్తూ ముందుకు వెళ్లి విజేతగా నిలుస్తారు. మరి కష్టపడిన దానికంటే తెలివితో విజేతలుగా నిలిచే అవకాశం ఉంటుందా? అందుకు ఉదాహరణే ఈ నీతి కథ..
ఒక అడవిలో రాముడు, భీముడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. మీరు ఇద్దరూ కట్టలు కొట్టి దొంగలను తరలించే పనుల్లోకి వెళ్లారు. రాము ఒకరోజు కష్టపడి 5 చెట్లను కొట్టి దుంగలను నదిని దాటించేవాడు. కానీ భీముడు మాత్రం పనికి ఆలస్యంగా వచ్చేవాడు. కానీ రాముతో పాటు సమానంగా 5 దుంగలు కొట్టి తరలించేవాడు. కానీ సాయంత్రం భీముడు కంటే రాముడు ఎక్కువగా అలసిపోయేవాడు. ఒకరోజు తీవ్రంగా అలసిపోయిన తీరును చూసి వారి యజమాని ఇలా చెప్పాడు. మీరు ఇద్దరూ కలిసి పనిచేసే సమయంలో నన్ను పిలవండి ఎవరు ఎలా చేస్తారో చూస్తా.. అని అంటాడు.
మరుసటి రోజు ఎప్పటిలాగే రాముడు 5 చెట్లను కొట్టి వాటి దుంగలను తరలిస్తాడు. అయితే రాముడు మాత్రం ఒక్కొక్క దుంగను నెత్తిపై మోసుకెళ్లి నదిని దాటిస్తాడు. ఆ నది వరకు తీసుకురావడానికి నెత్తిపై మోసుకొని వస్తాడు. అయితే భీముడు మాత్రం రెండు లేదా మూడు దొంగల కింద రోల్స్ లా ఉండే కట్టలను కడతాడు. ఆ తర్వాత ఆ దుంగలను రోల్స్ పై మెల్లమెల్లగా నెట్టుకుంటూ వస్తాడు. ఇలా ఒకేసారి మూడు.. మరోసారి రెండు దుంగలను తరలిస్తాడు. దీంతో భీముడికి పెద్దగా కష్టం అనిపించదు. ఇది చూసిన యజమాని రాముడు కష్టపడి చేస్తున్నాడు. కానీ భీముడు మాత్రం తన తెలివితో కష్టాన్ని తగ్గించి పనిని సులభంగా చేస్తున్నాడు అని చెబుతాడు.
ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఒకే రకంగా కష్టపడకుండా ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రస్తుత ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా పనులు చేయడం వల్ల కష్టం అనిపించదు. అంతేకాకుండా ఇతరులు చేసే పనిని ఫాలో కాకుండా సొంతంగా ఆలోచించే తెలివిని ఉపయోగించుకోవాలి. అప్పుడే ఎంతటి కష్టం పని అయినా సులభంగా చేయగలుగుతారు.
[