OG Movie Collections 3rd Week: ‘ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం మూడు వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. పవన్ అభిమానులకు ఈ సినిమా ఒక తీపి జ్ఞాపకం. ఈ చిత్రం పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించకపోయి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ చిత్రం ఒక విందు భోజనం లాంటిది. గడిచిన పదేళ్లలో పవన్ ని ఇంత పవర్ ఫుల్ గా చూపించిన డైరెక్టర్ ఎవ్వరూ లేరు. పవన్ కళ్యాణ్ ని వెండితెర పై బాగా చూపిస్తే చాలు, కథ కూడా అవసరం లేదు, కేవలం ఆయన అభిమానులు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూస్తే చాలు, భారీ సూపర్ హిట్ గా నిలుస్తాదని ప్రముఖులు సైతం ఎన్నో సందర్భాలలో చెప్పారు. దానిని ఓజీ చిత్రం రుజువు చేసింది. మూడు వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రాంతాలవారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో చూద్దాం.
నైజాం ప్రాంతం లో 55 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆల్ టైం టాప్ 6 చిత్రల్లో ఒకటిగా నిల్చింది. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే రాయలసీమ ప్రాంతం నుండి ఈ చిత్రం 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. సీమ లాంటి మాస్ ప్రాంతం లో ఒక అర్బన్ గ్యాంగ్ స్టర్ మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీ ఇంత దూరం రావడం అనేది చిన్న విషయం కాదు. సీడెడ్ తో పాటు మరో మాస్ ప్రాంతం అయినటువంటి ఉత్తరాంధ్ర లో కూడా ఈ చిత్రం 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఆ తరవాత తూర్పు గోదావరి జిల్లా నుండి 12 కోట్ల 20 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 8 కోట్ల 32 లక్షలు, గుంటూరు నుండి 11 కోట్లు, కృష్ణా జిల్లా నుండి 9 కోట్ల 70 లక్షలు, నెల్లూరు ఇళ్ల నుండి 4 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 136 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. గ్రాస్ తెలుగు రాష్ట్రాల నుండి 205 కోట్ల రూపాయిలు దాటినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఈ మార్కు ని దాటిన సినిమాలు #RRR, పుష్ప 2 , సలార్ మరియు దేవర. ఇప్పుడు ఓజీ చిత్రం కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది. అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల 30 లక్షలు, ఓవర్సీస్ నుండి 33 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా అన్ని కలుపుకొని చూస్తే ఈ చిత్రానికి 3 వారాల్లో 185 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అట.