‘ఓజీ’ ఖాతాలో ప్రపంచ రికార్డు తెరలేపిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్!

OG World Record: చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం తో తన కెరీర్ లో క్లీన్ హిట్ ని అందుకున్నాడు. టాక్ కాస్త యావరేజ్ రేంజ్ లో వచ్చినప్పటికీ, ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చడం తో ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టారు. 174 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా, ఏకంగా 180 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి, ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ సంగతి కాసేపు పక్కన పెడితే, సినిమా విడుదలకు ముందు అభిమానులు క్రియేట్ చేసిన యుఫోరియా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా యూత్ ఆడియన్స్ ఓజీ టీ షర్ట్స్ వేసుకొని తిరిగేవారు. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ సుజిత్ ఒక కామిక్ బుక్ ని రాసాడు.

ఈ బుక్ ని అభిమానుల చేతనే రెవీల్ చేయించాడు. అందుకు Oncemore.ai వెబ్ సైట్ వేదికగా మారింది. ఈ వెబ్ సైట్ లో బుక్ లాంచ్ అవ్వాలంటే, పది లక్షల మంది పవన్ కళ్యాణ్ అభిమానులు, వెబ్ సైట్ ని ఓపెన్ చేసి, అందులో క్రియేట్ చేయబడిన వీడియో గేమ్ ని ఆడాలి. అన్ని రౌండ్స్ ని పూర్తి చేసిన తర్వాత ఒక అభిమాని ఈ బుక్ లాంచ్ ఈవెంట్ లో భాగం అయ్యినట్టు. అలా ఒక్కసారిగా పది లక్షల మంది ఈ సైట్ ని తెరిచి చూడడం తో, గ్లోబల్ రికార్డు ఏర్పడింది. ప్రపంచం లో ఒక ఈవెంట్ కి ఇంతమంది అభిమానులు భాగమై చరిత్ర సృష్టించడం ఇదే తొలిసారి అంటూ ఆ సైట్ యాజమాన్యం చెప్పుకొచ్చింది. ఇక సినిమా విడుదల తర్వాత ఈ బుక్ ని కొనుగోలు చేయడం కోసం అభిమానులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఆన్లైన్ లో ఈ బుక్ ని పెట్టిన నిమిషాల వ్యవధిలోనే స్టాక్ మొత్తం అయిపోయేలా చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఈ బుక్ పేరు ‘ఓజీ: ది ఫస్ట్ బ్లడ్’. ఇది ఓజీ చిత్రానికి ప్రీక్వెల్ ఐడియా అని అనుకోవచ్చు. డైరెక్టర్ సుజీత్ కేవలం ఈ చిత్రం ఓజీ తోనే ఆగిపోదు, ఈ సినిమాకు ప్రీక్వెల్ తోప్ పాటు సీక్వెల్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రెండు సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాడు, వచ్చే ఏడాదిలో ఈ రెండు సినిమాల షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ సుజీత్. చూడాలి మరి, పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి పొలిటికల్ బిజీ కి ఈ రెండు సినిమాలు కార్య రూపం దాలుస్తాయా లేదా అనేది.

Leave a Comment