జపాన్‌లో ఒక నిరుద్యోగి తన తెలివి తేటలను బాగుపడానికి లేదా ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగించ లేదు. ఒక కంపెనీని మోసం చేయడానికి ఉపయోగించి.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన నేరానికి పాల్పడ్డాడు. నగోయాలో నివసించే 38 ఏళ్ల టకుయా హిగాషిమోటో.. ఫుడ్ డెలివరీ యాప్ ప్రకటించిన రీఫండ్ పాలసీని తన ATMగా మార్చుకున్నాడు. అతను యాప్ ఉన్న లోపాలను ఉపయోగించుకుని..డేళ్లపాటు ఉచితంగా ఖరీదైన ఆహారాన్ని తిన్నాడు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. టకుయా డెమే-క్యాన్ అనే ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లో రెండేళ్లపాటు ప్రతిరోజూ ఈల్ బెంటో, హాంబర్గర్ స్టీక్ తో పాటు రకరకాల వంటి ఖరీదైన వంటకాలతో పాటు ఐస్ క్రీమ్ ను ఆర్డర్ చేసేవాడు. ఇలా 1,000 సార్లకు పైగా ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. అయితే ఆ కంపీనిని తన తెలివి తేటలతో మోసం చేసి ఇదంతా చేశాడు.
ఉచితంగా 21 లక్షల విలువైన ఆహారం
ప్రతి ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత.. టకుయా తన ఆహారం డెలివరీ కాలేదని యాప్‌లో ఫిర్యాదు చేసేవాడు. ఇలా ఫుడ్ డెలివరీ అవ్వని సమయంలో కస్టమర్ కు కంపెనీ డబ్బులను పూర్తిగా వాపసు ఇస్తుంది. దానిని అవకాశంగా తీసుకుని ఫుడ్ ఆర్డర్ పెట్టి.. తిన్నాడు. డబ్బు తిరిగి పొందాడు. ఈ విధంగా టకుయా రెండు సంవత్సరాలలో కంపెనీకి 3.7 మిలియన్ యెన్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ. 2.1 మిలియన్లు) మోసం చేశాడు.
ఇవి కూడా చదవండి
అతని మోసం ఎలా బయట పడిందంటే
టకుయా ఒకటి కాదు రెండు కాదు, 124 నకిలీ ఖాతాలను సృష్టించాడు. ప్రతిసారీ అతను కంపెనీ వ్యవస్థ తనను గుర్తు పట్టకుండా.. మోసం చేయడానికి కొత్త పేరు, తప్పుడు చిరునామా, ప్రీపెయిడ్ సిమ్ కార్డును ఉపయోగించేవాడు. ఇలా చేయడం వలన తాను సురక్షితంగా ఉంటాడని.. హ్యాపీగా తింటూ బతికేయవచ్చు అని భావించాడు. అయితే పెద్దలు చెప్పినట్లు ,అబద్ధాలు , మోసాలు ఎన్నో రోజులు సాగవు. ఏదోక రోజు అవి పట్టుబడతాయి.
టకుయా ఎలా పట్టుబడ్డాడంటే
జూలై 30న టకుయా మళ్ళీ ఐస్‌క్రీమ్,చికెన్ స్టీక్ ఆర్డర్ చేశాడు. యధావిధిగా డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈసారి కంపెనీకి అనుమానం వచ్చింది. దీంతో టకుయా గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు. ఒకసారి కాదు రెండుసార్లు కాదు, 1,095 సార్లు ఇలా చేశాడని.. రీఫండ్ పాలసీలోని లొసుగును ఉపయోగించుకుని కంపెనీకి గణనీయమైన నష్టాలు కలిగించాడని దర్యాప్తులో తేలింది.
టకుయాపై దేశస్తులు కోపం
ఈ స్కామ్ బయటపడిన తర్వాత ఫుడ్ డెలివరీ యాప్ కంపెనీలు మరింత అప్రమత్తంగా మారాయి. కస్టమర్ ID వెరిఫికేషన్, అలర్ట్ సిస్టమ్‌లను కఠినతరం చేస్తున్నాయి. టకుయా చేసిన మోసం వలనే ఇదంతా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను ఇంత తెలివితేటలను ఏదైనా పని చేయడానికి ఉపయోగించి ఉంటే..ఇప్పటికి లైఫ్ లో సెటిల్ అయ్యేవాడని ప్రజలు అంటున్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..