ఎంఏ హిస్టరీ విద్యార్థినికి గోల్డ్ మెడల్ 

– Advertisement –

నవతెలంగాణ – బల్మూరు  
మండల పరిధిలోని శ్రీ ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొండనాగుల లో ఎంఏ హిస్టరీ చదువుతున్న డి కీర్తన బుధవారం గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఇందుకు సంబంధించి కళాశాల ప్రిన్సిపల్ పరంగి రవి మాట్లాడుతూ..పాలమూరు విశ్వవిద్యాలయం నాల్గవ వార్షిక కాన్వొకేషన్ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారని తెలిపారు. ఈ విశిష్ట గౌరవం ఆమె కృషి, ప్రతిభ మరియు అంకితభావానికి ప్రతీకగా నిలుస్తుందని  ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థినిని అభినందిస్తూ అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది ఆమె భవిష్యత్తు విద్యా ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు.

– Advertisement –

Leave a Comment