ఇండియన్‌ బ్యాంక్‌ ఫలితాలు ఆకర్షణీయం

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ బ్యాంక్‌ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 11.53 శాతం వృద్ధితో రూ.3,018 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,706 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.11,125 కోట్లుగా ఉన్న వడ్డీ ఆదాయం.. గడిచిన క్యూ2లో రూ.11,964 కోట్లకు పెరిగింది. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 2.40 శాతానికి తగ్గాయి. గతేడాది ఇదే సెప్టెంబర్‌ ముగింపు నాటికి 3.48 జీఎన్‌పీఏ చోటు చేసుకుంది.

The post ఇండియన్‌ బ్యాంక్‌ ఫలితాలు ఆకర్షణీయం appeared first on Navatelangana.

Leave a Comment