అందుకే.. రష్యా నుంచి ఇండియా చమురు కొంటోంది: అలిపోవ్

న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్‌లో రష్యా ముడిచమురు ధర చాలా చౌకగా ఉందని, తన దేశ ప్రయోజనాల దృష్టానే భారత్, రష్యా నుంచి ముడి చమురు తక్కువ ధరకు కొంటోందని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ గురువారం ఇక్కడ అన్నారు. రష్యా నుండి ముడి చమురు కొనుగోలును ఇండియా ఆపేయనుందని ప్రధాని నరేంద్ర మోడీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్న కొన్ని గంటలకే డెనిస్ అలిపోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ భారత్ మొత్తం హైడ్రోకార్బన్ దిగుమతుల్లో రష్యా ముడిచమురు వాటా దాదాపు మూడింట ఒక వంతు ఉందని అన్నారు. 

Leave a Comment