
విజేందర్ సొంత కథే అని అర్థమైంది..
అనుదీప్, విజయ్, ఆదిత్య హాసన్, కళ్యాణ్ శంకర్ ఇలా అందరూ రూమ్ మేట్స్. ఎవరి ప్రభావం ఎవరి మీద పడింది అన్నది చెప్పడం కష్టం. విజయేందర్ చెప్పిన కథ వింటే.. అనుదీప్ కథను కాపీ కొట్టాడా? అని అనిపించింది. కానీ ప్రతీ ఒక్క విషయాన్ని ఎంతో వివరంగా చెప్పాడు. అప్పుడు నాకు విజేందర్ సొంత కథే అని అర్థమైంది. బన్నీ వాస్ మిత్రమండలి, విజయేందర్ మిత్రమండలి, ఆర్టిస్టుల మిత్రమండలి, టెక్నీషియన్స్ మిత్రమండలి ఇలా అందరం కలిసి ఈ మూవీని చేశాం.
కుల వ్యవస్థ మీద మంచి సెటైరికల్ సీన్లు…
అనుదీప్ ఆ టైంలో ‘జాతి రత్నాలు’ కథ చెప్పినప్పుడు ఆయన రైటింగ్ నాకు చాలా నచ్చింది. సమాజంలోని కొన్ని సమస్యల్ని సెటైరికల్‌గా చెబుతుంటారు. ఇందు లో కుల వ్యవస్థ మీద విజేందర్ మంచి సెటైరికల్ సీన్లు రాసుకున్నారు. అయితే సినిమాల్లో ఇచ్చే సందేశాల ద్వారా సమాజం మారుతుందని నేను నమ్మను.
ఒకే రకమైన చిత్రాల్ని చేయడం ఇష్టం ఉండదు..
‘జాతి రత్నాలు’, ‘మిత్ర మండలి’ ఒకేలా ఉండవు. ‘జాతి రత్నాలు’ తరువాత ‘35 చిన్న కథ కాదు’, ‘కోర్ట్’ వంటి డిఫరెంట్ చిత్రాలు చేశాను. ఎప్పుడూ ఒకే రకమైన జానర్ చిత్రాల్ని చేయడం నాకు కూడా ఇష్టం ఉండదు. ‘జాతి రత్నాలు’ టైపులో ఎవరైనా కథ చెబితే కూడా వద్దని అంటాను.
సినిమాకు ఆమె పెద్ద ఆకర్షణగా…
నిహారిక ఎన్ఎం తెలుగమ్మాయి కావడం చాలా సులభతరమైంది. ఆమె మాతో ఎంతో బాగా కలిసిపోయారు. ‘మిత్ర మండలి’ సినిమాకు ఆమె పెద్ద ఆకర్షణగా మారా రు. అందరినీ అలరించే చిత్రం ‘మిత్ర మండలి’.
బాగా ఎంజాయ్ చేశాను…
‘మిత్ర మండలి’ స్క్రిప్ట్ విన్నప్పుడు నేను బాగా ఎంజాయ్ చేశాను. నాకు ఆద్యంతం ఎంటర్టైనింగ్గానే అనిపించింది. నేను విన్నప్పుడు ఏం అనుకున్నానో.. తెరపైకి కూడా అదే వచ్చింది. అందుకే నేను సినిమా విజయం పట్ల అంత నమ్మకంగా ఉన్నాను.
తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం నా దగ్గరకు చాలా డిఫరెంట్ కథలు వచ్చాయి. అందులో ‘ప్రేమంటే’ అనే మూవీ షూటింగ్ జరుగుతోంది. మరో రెండు కథలు నాకెంతో నచ్చాయి. వాటికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వస్తుంది.