Unemployement: సెప్టెంబర్‌లో 5.2 శాతానికి పెరిగిన నిరుద్యోగ రేటు

Unemployement: సెప్టెంబర్‌లో 5.2 శాతానికి పెరిగిన నిరుద్యోగ రేటు

దిశ, బిజినెస్ బ్యూరో: పనిచేసే అవకాశం ఉన్న 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తుల్లో నిరుద్యోగ రేటు నెలవారీగా స్వల్పంగా పెరిగింది. సెప్టెంబర్‌లో ఇది 5.2 శాతంగా నమోదైంది. అంతకుముందు ఆగష్టులో 5.1 శాతంగా ఉంది. జూలైలో 5.2 శాతం, మే, జూన్‌లలో 5.6 శాతంగా ఉన్నాయని గణాంకాలు, పథక అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కార్మిక సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం 4.6 శాతం నుంచి 4.3 శాతానికి పెరగ్గా, పట్టణ నిరుద్యోగంలో స్వల్ప పెరుగుదల కనిపించింది. ఇది ఆగష్టులో 6.7 శాతం ఉండగా, గత నెలలో 6.8 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంత మహిళల్లో నిరుద్యోగం 9.3 శాతానికి చేరుకుంది. అంతకుముందు నెలలో ఇది 8.9 శాతం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 5.2 శాతం నుంచి 5.5 శాతానికి పెరిగింది. రెండు ప్రాంతాల్లోని పురుషుల్లో నిరుద్యోగం అత్యధికంగానే ఉంది. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఎక్కువ మంది జాబ్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారని డేటా పేర్కొంది.

వారెవ్వా ‘పేరు’ తెచ్చిన అదృష్టం.. ఆ కంపెనీలో ఏకంగా రూ.4,300 కోట్ల పెట్టుబడులు 

Leave a Comment