Trump TIME magazine cover: ఇదేందిదీ.. అది నేనేనా..? ట్రంప్ అవాక్కు?

Trump TIME magazine cover: ఇదేందిదీ.. అది నేనేనా..? ట్రంప్ అవాక్కు?

Trump TIME magazine cover: డొనాల్డ్‌ ట్రంప్‌.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యారు. 2.0 పాలనలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదమవుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ అగ్రరాజ్యంపై ఆగ్రహంతో ఉన్నాయి. అయితే ట్రంప్‌ అమెరికా ఫస్ట్‌ అంటూ తన సెల్ఫిష్‌ ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్‌ ప్రపంచలో ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీకి ఎక్కారు. ఆయన ఫోటోను తాజా సంచికలో ప్రచురించింది. అయితే ఆయన ఫొటో ఇప్పుడు ట్రంపే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఎవరైనా టైమ్‌ మ్యాగజైన్‌పై పొటో వచ్చిందంటే సంతోషపడతారు. ట్రంప్‌ మాత్రం గుర్రుగా ఉన్నారు. అందుకు కారణం ఆ ఫోటో తీసిన యాంగిలే!

తనను తానే గుర్తు పట్టలేక..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. టైమ్‌ మ్యాగజైన్‌ తాజా ‘‘హిస్‌ ట్రయంప్‌’’ కవర్‌ఫోటోలో తన జుట్టు కనబడకుండా వేసిన తీరు గుర్తించి, నిజంగా ఇది తానేనా? అంటూ సోషల్‌ మీడియాలో సీరియస్‌గా మండిపడ్డారు. ‘‘ఫొటోలో నా జుట్టు గాళ్లంతా చీలిపోయాయి, తల మీద చిన్న కిరీటం తేలియాడుతుందిలా చూపించారు. ఇది చాలా క్లిష్టమైన ఫొటో.. ఏమి చేసారో, ఎందుకో!’’ అని ట్రంప్‌ మండిపడ్డారు. ఫొటోను ఇంత అరాచకంగా తీస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కథ ముద్దుగా రాశారు.. కానీ,,
మ్యాగజైన్‌లో తన గురించి స్టోరీ బాగా రాశారని పేర్కొన్న ట్రంప్‌ కవర్‌ పొటో విషయంలో మాత్రం నిరుత్సాహం వ్యక్తం చేశారు. స్టోరీలో మంచి విషయాలు ఉన్నాయని ప్రశంసించారు. తన మధ్యప్రాచ్య శాంతి ఒప్పందం (ఇజ్రాయిల్‌–హమాస్‌ కాల్పులు ఆపేసినదీ, భారీ ఖైదీల మార్పిడి సైతం)ను ప్రశంసించారంటూ చెప్పారు . టైమ్‌ మ్యాగజై తాఆగా ఇజ్రాయెల్‌–హమాస్‌ శాంతి ఒప్పందాన్ని హైలెట్‌ చేసింది. ట్రంప్‌ను కీర్తించింది. అందుకే అతని ఫొటోను కవర్‌ పేజీపై వేసింది.

ఫొటోతో అవమానం..
ఫొటో కచ్చితంగా అవమానకరం అని, ఇలా నేనొక పెద్దగా వేషంగా ఫోటో తీసి దిగినట్టుగానే చూపించారంటూ ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టైమ్‌ అనుకునే ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదని సోషల్‌ మీడియాలో రాశారు. మరోవైపు నెటిజన్లు ఈ ఫొటోతో సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. ఓ ఆటాడుకుంటున్నారు.

ట్రంప్, టైమ్‌ం పాత పగలు!
ఫిబ్రవరిలో కూడా టైమ్‌ తనను ఆసాంతం వివరించినా, దాని కవర్‌ మీద తనను దాటి ఓ తదుపరి అధికారులు(ఎలోన్‌ మస్క్‌) ఒవల్‌ ఆఫీస్‌లో కూర్చున్నట్టు వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా తనకు గుర్తింపు ఇచ్చినా.. పదేపదే ఇబ్బందికరమైన ఫొటోలను వేయడం అవమానంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

నిజంగా… ఫొటోలు కూడా నాయకుడికి అభిరుచి పట్టించుకోవాలి. జుట్టు పోయిందీ… చిన్న కిరీటం తేలియాడిందీ అని ట్రంప్‌ సెట్టయే స్టైల్లో కామెంట్‌ చేశాడు. కానీ అమెరికా పాలకుడిగా ప్రపంచానికి శాంతి తెచ్చిందని టైమ్‌ మెచ్చుకుంది. అయినా, ట్రంప్‌ స్టయిలే వేరు.. తనకు ఊహించిన ఫొటో వస్తే గాని అంతా నిండుగా అనిపించదు.

Leave a Comment