I LOVE PIG: మధ్యప్రదేశ్లో ఐ లవ్ పిగ్ పోస్టర్ల కలకలం.. అసలేంటి వివాదం.. ఏమైంది?

I LOVE PIG: మధ్యప్రదేశ్‌లో కొన్ని రోజులుగా ఐ లవ్‌ మహ్మద్‌ నినాదంతో ఉద్యమం జరుగుతోంది. ఓ సామాజిక వర్గానికి చెందినవారు ఈ నినాదంతో ర్యాలీలు తీస్తున్నారు. ఫోస్టర్లు వేస్తున్నారు. అయితే ఇది ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమం కాకపోవడంతో పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ నినాదం రోజు రోజుకూ విస్తరిస్తుండడంతో హిందువులు రంగంలోకి దిగారు. ఐ లవ్‌ మహ్మద్‌కు చెక్‌ పెట్టేందుకు చర్యలు చేపట్టారు.

తాజాగా కొత్త పోస్టర్లు..
ఇందోర్‌ నగరంలో ఐ లవ్‌ మహ్మద్‌ పోస్టర్లు విస్తృతమవుతున్న సమయంలో సామాజిక వర్గాల్లో తీవ్ర వ్యతిరేత ఫెరిగింది. ఈ నేపథ్యం ఇటీవల కొత్తగా ‘ఐ లవ్‌ పిగ్‌’ అనే పోస్ట్‌లు నగర వ్యపార, పబ్లిక్‌ ఏరియాల్లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇది ముస్లిం సమాజానికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఈ పోస్టర్లు ఇస్లాం మతంలో అపవిత్రంగా భావించే పంది సహా అంబార్థాలతో సమాజవర్గాల మధ్య ఉద్రిక్తతలను పెంచాయి. దీంతో ముస్లింలు రోడ్లపైకి వచ్చి ఐ లవ్‌ పిగ్‌ పోస్టర్లకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తమ మత విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్న పోస్టర్లు తొలగింపజేయడంతోపాటు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

పోలీస్‌ యాక్షన్‌..
నిరసనలను అడ్డుకోవడానికి స్థానిక పోలీస్‌ బలగాలు రోడ్లపైకు నిరోధించాలని ప్రయత్నించారు. కొందరు నిరసనకారులను అరెస్ట్‌ చేశారు. ఉన్నతాధికారులు ఈ పోస్టర్ల తొలగింపు చర్యల్ని చేపట్టారు. సమాజంలో శాంతి నిలుపుకునేందుకు, హింసాపూరిత సంఘటనలు నివారించేందుకు పోలీసు చర్యలు చేపట్టారు. ఐ లవ్‌ మహ్మద్‌తోపాటు ఐ లవ్‌ పిగ్‌ పోస్టర్లను తొలగింపజేశారు.

Also Read: గూగుల్ పెట్టుబడి 10 కాదు 15 బిలియన్ డాలర్లు

మొత్తంగా ఈ సంఘటనలు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక రాజకీయాల్లో చర్చలకు, వివాదాలకు దారితీయడంతో, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, సమాజ సమైక్యత, భయ నివారణ వంటి అంశాల పట్ల ప్రభుత్వ తగిన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాన్ని రేకెత్తించాయి. మీడియా కూడా ఈ వివాదాన్ని వేడెక్కించడంలో పాత్ర వహించింది.

Leave a Comment