HCA సెలక్షన్‌ కమిటీ సభ్యులపై కేసు నమోదు – Telugu News | Hyderabad Cricket Association Officials Booked for Alleged Cash for Selection Scam video TV9D – Sports Videos in Telugu

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సెలక్షన్ కమిటీ సభ్యులపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రికెటర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేశారన్న తీవ్ర ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నారు. అండర్-19, అండర్-23 లీగ్‌లలో యువ క్రికెటర్లకు అవకాశం కల్పించేందుకు సెలక్షన్ కమిటీ సభ్యులు డబ్బులు డిమాండ్ చేశారని పలువురు క్రికెటర్ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్ తో పాటు సభ్యులు రాజన్, సందీప్ త్యాగి ఉన్నారు. తమ పిల్లలను లీగ్‌లలో ఆడించేందుకు వారి నుంచి డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాయం చేసేదీ వాళ్లే! సాయం అందించేదీ వాళ్లే

దడ పుట్టిస్తున్న బంగారం ధర.. బుధవారం తులం ఎంతంటే?

వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్… ఏకంగా వైస్ కెప్టెన్సీ ఛాన్స్‌

ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో దెబ్బే.. సర్వేలో షాకింగ్ నిజాలు

బైకుపై రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం.. ఆ తర్వాత

 

Leave a Comment