Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు పరుగులు పెడుతోంది. నిన్న ఏకంగా తులం బంగారం ధర 1 లక్ష 30 వేల వరకు వెళ్లింది. బంగారం, వెండి ధరలను చూస్తుంటే సామాన్యులు సైతం కొనలేని పరిస్థితి ఉంది. తాజాగా అక్టోబర్ 15న దేశంలోని బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ఇక దేశీయంగా ధరలను చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,360 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,660 వద్ద కొనసాగుతోంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,510 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,810 ఉంది.
- హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,360 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,660 ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,360 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,660 ఉంది.
- చెన్నై 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,901 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,260 ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,360 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,660 ఉంది.
ఇది కూడా చదవండి: Auto News: దేశ ప్రజల మనస్సు దోచుకున్న బైక్‌లు.. కేవలం రూ.75వేలలోనే.. మైలేజీ మాత్రం అదుర్స్!
ఇవి కూడా చదవండి
వెండి ధరలు:
ఇక బంగారం బాటలోనే వెండి ధర పయనిస్తోంది. ఇది కూడా ఎన్నడులేని విధంగా పరుగులు పెడుతోంది. ఎందుకంటే ఇటీవల కాలం నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు రావడంతో వాటి తయారీ కోసం వెండిని ఎక్కువ వినియోగిస్తున్నారు. దీంతో వెండి ధరలు భారీగా పెరుగుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.1,89,100 ఉంది. అదే హైదరాబాద్, కేరళ, చెన్నై రాష్ట్రాల్లో అయితే కిలో వెండి ధర రూ.2,06,100 ఉంది.
ఇది కూడా చదవండి: Suzuki Hydrogen Scooter: బైక్ ప్రియులకు గుడ్‌న్యూస్.. సుజుకి నుంచి హైడ్రోజన్ స్కూటర్..!
10 రోజుల్లో రూ. 35 వేలు పెరిగిన వెండి
వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్క రోజే రూ. 5వేలు పెరగగా, మంగళవారం దాదాపు రూ. 4 వేలు పెరిగింది. కాగా గడిచిన 10 రోజుల్లో కిలో వెండి సుమారు రూ.35,000 పెరగడం విశేషం. ఈ రేటు పెరుగుదలతో వెండి ధర పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు.రానున్న రోజుల్లోనూ వెండి ధరలు మరింత పెరగడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు.
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి.?
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ వంటి పరిణామాలు ఇన్వెస్టర్లను బంగారం వైపు ఆకర్షిస్తున్నాయి. డాలర్ విలువ పడిపోవడం కూడా ఈ పెరుగుదలపై ప్రభావం చూపుతోంది. డాలర్ బలహీనతతో బంగారం సురక్షిత పెట్టుబడిగా కనిపిస్తోంది. ట్రెజరీ బాండ్ల లాభాలు తగ్గడంతో ఇన్వెస్టర్ల దృష్టి బంగారం వైపే మళ్లింది. ఫలితంగా బంగారం ధరలు చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయికి చేరాయి.
ఇది కూడా చదవండి: Bank Holidays: అక్టోబర్ నెల పండగ సీజన్.. 11 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజు అంటే..
ఇది కూడా చదవండి: BSNL Annual Plan: ఈ చౌకైన రీఛార్జ్‌తో ఏడాది పాటు వ్యాలిడిటీ.. అక్టోబర్ 15 వరకు మాత్రమే.. మిస్ కాకండి!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి