Cyber Fraud: సరికొత్త వాట్సాప్ స్క్రీన్ మిర్రరింగ్ స్కామ్! కాల్ ఎత్తారో ఇక అంతే సంగతి! | What is whatsapp screen mirroring fraud and how to be safe from that

రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన వాట్సాప్ స్క్రీన్ మిర్రరింగ్ ఫ్రాడ్ లో  సైబర్ మోసగాళ్లు బ్యాంక్ ప్రతినిధులుగా కాల్ చేసి వారి స్క్రీన్‌లను షేర్ చేయమని అడుగుతారు. తద్వారా స్క్రీన్ మీద కనిపించే ఓటీపీ(OTP)లు, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేస్తారు. ఫలితంగా బాధితులు అకౌంట్ నుంచి డబ్బు కాజేస్తారు. ఈ స్కామ్ గురించి మరింత వివరంగా చెప్పాలంటే..

స్కామ్ ఇలా..

స్కామర్ ముందుగా ఒక బ్యాంకు ఉద్యోగిగా నటిస్తూ కాల్ చేస్తాడు. మీ అకౌంట్ లో సమస్య ఉందని చెప్పి దాన్ని మీరే ఫోన్ లో సరిచేయొచ్చని చెప్తాడు. ఆ తర్వాత మీ స్క్రీన్‌ను షేర్ చేయమని మిమ్మల్ని ఒప్పిస్తారు. ఇక్కడే స్కామ్ ప్రారంభమవుతుంది. ఒకవేళ మీరు స్క్రీన్ షేర్ చేస్తే మీ స్క్రీన్‌ను స్కామర్లు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ ను యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. అది స్క్రీన్ షేర్ చేసిన స్కామర్లకు కూడా కనిపిస్తుంది. ఆ ఓటీపీతో వాళ్లు మీ బ్యాంక్ అకౌంట్ ను హ్యాక్ చేస్తారు.

జాగ్రత్తలు ఇలా..

ఇలాంటి స్కామ్ ల్లో చిక్కుకోకూడదు అంటే తెలియని నంబర్ల నుండి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకుండా జాగ్రత్తపడాలి. గుర్తు తెలియని వారితో స్క్రీన్ షేర్ చేయొద్దు. ఒకవేళ ఎవరితోనైనా స్క్రీన్ షేరింగ్ లో ఉంటే ఆ టైంలో మొబైల్ బ్యాంకింగ్, UPI యాప్‌ల వంటివి ఓపెన్ చేయొద్దు. మీరు ఏదైనా సైబర్ స్కామ్ బారిన పడి డబ్బు కోల్పోతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Leave a Comment