BSF Constable Jobs 2025: పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్ష లేదు – Telugu News | Border Security Force Sports quota Recruitment 2025 Notification for 391 Constable Posts, Apply online

భారత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌).. గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్‌ కింద స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 391 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హులైన పురుషులు, మహిళ క్రీడాకారులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. స్పోర్ట్స్‌ కోటా కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల్లో పురుష అభ్యర్ధులకు 197 పోస్టులు, మహిళా అభ్యర్ధులకు 194 చొప్పున పోస్టులు కేటాయించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను నవంబర్‌ 4, 2025వ తేదీ వరకు స్వీకరించనున్నారు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, హాకీ, ఫుట్‌బాల్, స్విమ్మింగ్, షూటింగ్, జూడో, కరాటే, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, సైక్లింగ్ తదితర క్రీడా విభాగాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే మెట్రిక్యులేషన్ (టెన్త్‌)లో విద్యార్హత కలిగి ఉండాలి. 2023 నవంబర్ 4 నుంచి 2025 నవంబర్ 4 వరకు జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారు, అలాగే పాల్గొన్న వారు కూడా అర్హులు. దరఖాస్తుదారుల వయసు ఆగస్ట్‌ 01, 2025 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల చొప్పున వయోసడలింపు వర్తిస్తుంది.

ఆసకతి కలిగిన వారు అక్టోబర్‌ 16, 2025వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. యూఆర్‌, ఓబీసీ, ఓబీసీ అభ్యర్ధులురూ.159 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళ అభ్యర్ధులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), స్పోర్ట్స్ మెరిట్ లిస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Comment