ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఎట్టకేలకు భారతదేశంలో కామన్ వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. 2030 కామన్‌వెల్త్ గేమ్స్‌కు భారత్ ఎంపికైంది. అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్‌వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. సార్వత్రిక క్రీడల చరిత్రలో భారత్ ఒక గొప్ప అవకాశం కోసం ఎదురు చూస్తోంది. 2030లో జరగనున్న శతాబ్ది కామన్వెల్త్ క్రీడలకు (Commonwealth Games – CWG) ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ అధికారికంగా బిడ్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇది కేవలం క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం మాత్రమే కాదు, అంతర్జాతీయ క్రీడా వేదికపై భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేయడంతో పాటు, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం వైపు వేస్తున్న ముందడుగు వేయనుంది.
