బీహార్ రంజీ జట్టుకు కెప్టెన్‌గా నియమితులైన సకీబుల్ గని.. కూడా అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఆటగాడు. గని 2022లో బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. తన మొదటి మ్యాచ్‌లోనే 341 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో డబ్యూ మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా గని రికార్డు సృష్టించాడు. తన అద్భుతమైన ప్రదర్శన, నిలకడ కారణంగా ఇప్పుడు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. అండర్-19 స్థాయిలో మంచి ప్రదర్శన కనబరిచిన లెఫ్ట్ హ్యండర్ వైభవ్ సూర్యవంశీకి బీహార్ రంజీ జట్టులో వైస్ కెప్టెన్సీ ఇవ్వటం నిజానికి పెద్ద బాధ్యత. అయితే, వైభవ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్ర చూస్తే.. ఇప్పటివరకు బీహార్ తరఫున కేవలం 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ 10 ఇన్నింగ్స్‌లలో 158 బంతుల్లో 100 పరుగులే చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. అయితే.. మనోడి అండర్-19 అనుభవం, నాయకత్వ లక్షణాలను చూసి.. తొలిసారిగా వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. వైభవ్ తన ఆరో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను ఉప-కెప్టెన్‌గా ఆడనున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో దెబ్బే.. సర్వేలో షాకింగ్ నిజాలు
బైకుపై రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం.. ఆ తర్వాత
భారత్‌లో అప్ఘాన్ మంత్రి.. వణుకుతున్న పాక్
ఏనుగుల గుంపు బీభత్సం.. నిద్రపోతున్నవారిపై దాడి
ఉపవాసం ఉన్న మహిళ.. గుండెపోటుతో కర్వాచౌత్ నాడు మృతి