‘రాక్షసుల ఆగమనం’.. ‘సంబరాల ఏటి గట్టు’ గ్లింప్స్ అదిరిపోయిందిగా..


మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’. ‘విరూపాక్ష’, ‘బ్రో’ చిత్రాల తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని తేజ్ నటిస్తున్న చిత్రం ఇది కావడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్‌డేట్స్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే బుధవారం తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేశారు. ‘అసుర ఆగమనం’ పేరుతో విడుదలైన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరో లెవల్‌కి తీసుకెళ్లింది.

ఈ గ్లింప్స్ బట్టి చూస్తే మాస్ యాక్షన్ మూవీ అని క్లారిటీ వచ్చింది. గ్లింప్స్‌లోని ప్రతీ షాట్ అదిరిపోయిందిని ఫ్యాన్స్ అంటున్నారు. చివర్లో ‘అసుర సంధ్యవేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం’ అంటూ తేజ్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాకి రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తుండగా.. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా ఈ నెలలోనే విడుదల చేస్తామంటూ చాలాసార్లు ప్రకటించారు. కానీ, ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో దాన్ని వాయిదా వేశారు. మరి సినిమాను ఈ ఏడాది తీసుకొస్తారా..? లేదా వచ్చే ఏడాదికి వాయిదా..? పడుతుందో చూడాలి.

Leave a Comment