Bigg Boss 9 Telugu Tanuja: ఈ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) సీజన్ లో అందరికంటే టాప్ ఓటింగ్ తో కొనసాగుతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది తనూజ మాత్రమే. అందులో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియా లో ఎక్కడ పోల్ పెట్టినా ఆమె అందరికంటే భారీ మార్జిన్ లీడ్ తో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుంది. ఈమె మిగిలిన కంటెస్టెంట్స్ తో సమానంగా గేమ్స్ ఆడడం మనం ఎప్పుడూ చూడలేదు. హౌస్ లోకి వచ్చి 5 వారాలు పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు ఈమె సొంతంగా ఆడిన గేమ్స్ ఒక్కటి కూడా గెలవలేదు. కేవలం తన స్వార్థం చూసుకొనే గేమ్స్ ఆడుతుంది కానీ, ఒకరి కోసం ఈమె గేమ్ ఆడినట్టు ఎప్పుడూ అనిపించలేదు. నాన్న,నాన్న అని పిలుస్తూ, భరణి గురించి వెనుక చేరి ఎన్నోసార్లు తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. జనాల్లో నెగిటివ్ అవ్వడానికి ఇన్ని పాయింట్స్ దొరికినా కూడా తనూజ తన తోటి కంటెస్టెంట్స్ పై ఈ రేంజ్ మార్జిన్ తో లీడింగ్ లో ఉండడం ఒక వండర్ అనే చెప్పాలి.
కేవలం ఆమె అందాన్ని చూసి ఓట్లు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. తనూజ లో ఉన్న రెండు పాజిటివ్ పాయింట్స్ లో ఒకటి ఆమె అందం కాగా, రెండు నామినేషన్స్ సమయం లో తనని తానూ డిఫెండ్ చేసుకునే విధానం. తనకు ఎదురుగా ఎంతమంది వాదించడానికి వచ్చినా, సింగిల్ హ్యాండ్ తో సమాధానం చెప్పే సత్తా ఆమెలో ఉంది. నిన్న కూడా అయేషా లాంటి తోపు కంటెస్టెంట్ కి నామినేషన్స్ సమయం లో బలంగా నిలబడి తనని తానూ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ రెండు విషయాలు తప్ప, ఆమెలో చెప్పుకోడానికి ఏమి లేవు. హౌస్ లో కూడా ఆమె ఫేక్ రిలేషన్స్ పెట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది.
నిన్న మొన్నటి వరకు నాన్న, నాన్న అంటూ భరణి చుట్టూ తిరిగిన తనూజ, ఇప్పుడు మాత్రం ఆయన ముఖం కూడా చూసేందుకు ఇష్టం చూపడం లేదు. అకస్మాత్తుగా ‘నాన్న’ కాస్త ‘భరణి సార్’ గా మారిపోయాడు. మొన్నటి వీకెండ్ ఎపిసోడ్స్ లో వచ్చిన ఇన్ పుట్స్ ఆధారంగా ఆమె తన గేమ్ ని అప్పటికప్పుడు మార్చుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు భరణి నాన్న అనడం మానేసి, దివ్వెల మాధురి ని అమ్మా అని పిలవడం మొదలు పెట్టింది. హౌస్ లోకి మాధురి అడుగుపెట్టిన రోజే తనూజ భయపడింది. ఆమ్మో ఈమె ఏంటి, ఈ రేంజ్ లో ఉండి, ఫైర్ బ్రాండ్ నా? అని ఇమ్మానుయేల్ తో చెప్పుకొని భయపడింది. ఈమెతో గొడవలు పెట్టుకోవడం ఎందుకు, మంచిగా ఉండడం బెటర్ అని అనుకుందో ఏమో తెలియదు కానీ, రెండు రోజుల్లో ఆమెకు భయంకరంగా క్లోజ్ అయిపోయింది. ఎంతలా అంటే రాత్రి పడుకునే ముందు మాధురి పై పడుకొని, గట్టిగా హత్తుకునే రేంజ్ లో అన్నమాట. ఇదంతా చూసే జనాలకు స్పష్టం గా ఈమె దొంగ నాటకాలు ఆడుతుంది అనేది అర్థం అయిపోతుంది. ఇలా అయితే టైటిల్ గెలవడం కష్టం అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.