భారత్‌లో అప్ఘాన్ మంత్రి.. వణుకుతున్న పాక్ – Telugu News | Afghan Pak Border Bloodshed: India’s Strategic Embrace of Taliban Amidst Clashes video TV9D – World Videos in Telugu

తమ దాడుల్లో 58 మంది పాక్‌ సైనికుల్ని మట్టుబెట్టామని, మరో 30 మందిని తీవ్రంగా గాయపరిచామని అప్ఘానిస్థాన్ ప్రకటించింది. ఇంతటితో ఆగకుండా.. మరో ఏడుగురు పాక్ జవాన్లను బందీలుగా తీసుకున్నామంటూ వారి ఫోటోలను అప్ఘాన్ దళాలు రిలీజ్ చేశాయి. పాకిస్థాన్‌లో నక్కి.. తరచూ తమ దేశం మీద దాడులకు పాల్పడుతున్న ముష్కరులను తమకు అప్పగించే వరకు ఈ దాడులు కొనసాగుతాయని పాకిస్థాన్‌కు తాలిబన్లు అల్టిమేట్టమ్ జారీ చేశారు. ఈ విపత్కర పరిస్థితిలో ఏం చేయాలో తోచని పాకిస్థాన్ ప్రస్తుతానికి అఫ్ఘాన్‌ సరిహద్దును మూసేసి బిక్కుబిక్కుమంటోంది. పులి మీద పుట్రలా.. సరిగ్గా ఇదే సమయంలో తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి భారత్‌తో పర్యటించి, కీలక నేతలతో మంతనాలు జరపటం పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేస్తోంది. అప్ఘానిస్థాన్ ప్రభుత్వ ఆర్థిక మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తాఖీ తన ఆరు రోజుల భారత పర్యటనలో భాగంగా.. శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లోని ప్రముఖ ఇస్లామిక్ విద్యాలయం ‘దారుల్ ఉలూమ్ దేవ్ బంద్’ను సందర్శించారు. ఆయనకు విద్యాలయం వద్ద ముస్లిం పెద్దలు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ముత్తాఖీని చూసేందుకు స్థానిక ముస్లింలు పెద్ద ఎత్తున దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ వద్దకు తరలిరావటంతో.. ఈ ఆదరణ , స్వాగతం తన హృదయాన్ని తాకిందని పేర్కొన్నారు. అక్కడి నుంచి ఆయన.. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ వద్దకు వెళ్లారు. ఇదంతా ఒకెత్తు అయితే.. అప్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులను అడుగుపెట్టనీయబోమని.. భారత్ గడ్డమీద స్పష్టమైన ప్రకటనచేశారు. ‘ఫిరంగులతోనే కాదు, బలమైన దౌత్యంతోనూ మేం పాక్‌కు జవాబిస్తాం’అని ప్రకటన చేశారు. తమ దేశ సరిహద్దుల్ని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసునంటూ.. ఢిల్లీనుంచే చూపుడువేలుతో పాకిస్తాన్‌కి ఓ క్లియర్‌ మెసేజ్ ఇచ్చేశారు. పైగా, మన విదేశాంగమత్రి జైశంకర్‌కి షేక్‌హ్యాండూ, గట్టిగా ఓ హగ్గూ ఇచ్చిన సీను.. పాక్ పాలకుల కడుపు మండించింది. శతృవుకు శతృవు.. ఆటోమేటిగ్గానే మనకు మిత్రుడౌతాడు. ట్రంప్ అహంకారం, పాక్ కుతంత్రం అన్నీ కలిసి భారత విదేశాంగ విధానంలో అనూహ్య మార్పులు తెస్తున్నాయి. అమెరికా చిరకాల శతృవు చైనాకు స్నేహహస్తం చాచిన భారత్.. తనదైన శైలిలో దక్షిణాసియా జియోపాలిటిక్స్‌ను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. సో, పక్కాగా లెక్కేసుకుని వ్యూహాత్మకంగా కదులుతోంది ఇండియా. లేటెస్ట్‌గా, పాకిస్తాన్‌తో వైరం నేపథ్యంలో అఫ్ఘానిస్తాన్‌కి దగ్గరవ్వడం, తాలిబాన్లతో చెలిమి కట్టడం భారత దౌత్యనీతిలో వచ్చిన స్పష్టమైన మార్పు. అక్కడ పాకిస్తాన్‌తో యుద్ధ సన్నివేశం.. ఇక్కడ ఇండియాతో తాలిబన్ల దోస్తానా… ఇది కదా బిగ్ పిక్చర్ అంటే?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏనుగుల గుంపు బీభత్సం.. నిద్రపోతున్నవారిపై దాడి

ఉపవాసం ఉన్న మహిళ.. గుండెపోటుతో కర్వాచౌత్‌ నాడు మృతి

యుద్ధాలు ఆపడంలో నేనే తోపు.. మరోసారి ట్రంప్ సొంత డబ్బా

ఆన్ లైన్ లో సరుకులు ఆర్డర్ చేస్తున్నారా? రూ.2 లక్షల మోసం గురించి మీకు తెలుసా?

వేగంగా దూసుకెళ్తున్న కారు.. ఒక్కసారిగా

Leave a Comment