ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో సంచలనం సృష్టించిన ఆఫ్రికా దేశం కేప్ వెర్డె

ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఆఫ్రికా దేశం కేప్ వెర్డె పెను సంచలనం సృష్టించింది. వచ్చే ఏడాది అమెరికా, కెనడా వేదికగా జరుగనున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి కేప్ వెర్డె అర్హత సాధించింది. కేవలం ఐదు లక్షల 25 వేల జనాభా మాత్రమే కలిగిన కేప్ వెర్డె ఆఫ్రికా జోన్ గ్రూప్‌డి పోటీల్లో అద్భుత ఆటను కనబరిచిన మెగా టోర్నీకి దూసుకెళ్లింది.

కీలకమైన మ్యాచ్‌లో కేప్ వెర్డె త్రీ-0 గోల్స్ తేడాతో ఈశ్వతిని టీమ్‌ను చిత్తు చేసింది. ఐస్‌లాండ్ తర్వాత ప్రపంచకప్‌కు అర్హత సాధించిన అతి తక్కువ జనాభా కలిగిన రెండో దేశంగా కేప్ వెర్డె అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్‌లో 48 దేశాలు పోటీ పడనున్నాయి. ఆఫ్రికా జోన్‌కు 9 బెర్త్‌లు కేటాయించగా ఆరు జట్లు ఇప్పటికే వరల్డ్‌కప్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి.

Leave a Comment