Bigg Boss 9 Telugu Tanuja And Ayesha Fight: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ గా ఎంట్రీ ఇచ్చిన వారిలో అయేషా మొదటి రోజు నుండి ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఈమె మాట తీరు, చలాకీతనం అందరికీ చాలా నచ్చేసింది. ఎదో ఒకటి,రెండు వారాలు హౌస్ లో ఉండి వెళ్లిపోయే రకం కాదు, కచ్చితంగా టాప్ 5 వరకు వెళ్లే కంటెస్టెంట్ అని నిన్నటి నామినేషన్స్ లో తనని తానూ నిరూపించుకుంది. అయితే ఎందుకో బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ ని అయేషా కి పాజిటివ్ గా, తనూజ కి నెగిటివ్ గా కట్ చేసినట్టు అనిపించింది. లైవ్ లో అయేషా నామినేషన్ చూసిన వాళ్లకు ఈ విషయం అర్థం అవుతుంది. అయేషా సరైన పాయింట్స్ తో తనూజ ని ఇరుకున పెట్టి అల్లాడించే ప్రయత్నం చేస్తే, తనూజ ఆమె పాయింట్స్ కి ధీటైన సమాధానాలు చెప్పి ఇంకా ఎక్కువగా అల్లాడించింది.
కానీ ఎపిసోడ్ ని మాత్రం కేవలం ఆయేషా ని పైకి లేపేందుకే కట్ చేసినట్టు అనిపించింది. అయేషా తనూజ ని నామినేట్ చేస్తూ ‘నీ వల్ల హౌస్ లో లేడీస్ కి అన్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. నీ వల్ల భరణి గారి గేమ్ కూడా చెడిపోతుంది. ప్రతీ టాస్క్ లోనూ నువ్వు ఆయన సహాయం కావాలని కోరుకుంటావు, ఆయన ఎవరితో అయిన క్లోజ్ గా ఉంటే అసూయ పడుతావు, బెడ్ టాస్క్ లో నీ వల్ల లేడీస్ అందరికీ అన్యాయం జరిగింది. స్టార్ మా ఛానల్ లో ఇప్పటికే మంచి సీరియల్స్ నడుస్తున్నాయి. నువ్వు హౌస్ లో ‘నాన్న..నాన్న’ అంటూ మరో సీరియల్ నడపాల్సిన అవసరం లేదు. ప్రతీ దానికి ఓవర్ గా ఎమోషనల్ అయిపోతూ ఉంటావు, అది నాకు ఫేక్ గా అనిపించింది. హౌస్ లో ఒక నాన్న, లవర్ ఉంటే చాలు, ఫైనల్స్ వరకు వచ్చేయొచ్చని అనుకుంటున్నారు’ అంటూ గన్ షాట్ లాంటి పాయింట్స్ ని పెట్టి నామినేట్ చేసింది.
దీనికి తనూజ కౌంటర్ ఇస్తూ ‘నన్ను ఓవర్ ఎమోషనల్ అని అంటున్నావు. ఇందాక బాల్ నీ చేతికి రానందుకు బాత్ రూమ్ కి వెళ్లి ఏడ్చుకుంటూ కూర్చున్నావు. నువ్వొచ్చి నన్ను కామెంట్ చేయడం కామెడీ గా ఉంది. ఇక భరణి గారు ప్రతీ సారి నాకు సహాయం చేసారని అంటున్నావు, ఆయన నాకు సహాయం చేసింది మొన్నటి టాస్క్ లోనే, కేవలం ఒక్క టాస్క్ కి సహాయం చేస్తే, ప్రతీ టాస్క్ లోనూ ఆయనే నాకు సహాయం చేసినట్టు చెప్తున్నావు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు’ అని అంటుంది. మధ్యలో భరణి కూడా అయేషా కి సమాధానం చెప్తూ ‘నేను ఎన్ని రిలేషన్స్ లో ఉన్నప్పటికీ కూడా, నా గేమ్ పై ఆ రిలేషన్స్ ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఒక్క టైర్ టాస్క్ లో తప్ప, ప్రతీ టాస్క్ లోనూ నేను టాప్ 2 వరకు వచ్చాను. గత వారం లో కూడా నా టీమ్ నే టాప్ 1 లో ఉన్నది. కాబట్టి తనూజ వల్ల నా గేమ్ చెడిపోతుంది అనడం లో ఎలాంటి వాస్తవం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఎపిసోడ్ లో చూపించని కొన్ని పాయింట్స్ తో కూడిన వీడియో ని క్రింద అందిస్తున్నాము చూడండి.