Hero Nani: సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా హీరోలు వాళ్ళు మాత్రమే స్టార్ పొజిషన్ ని అందుకుంటారు అనేది అవాస్తవం. టాలెంట్ ఉండి మంచి కథలను ఎంచుకొని వరుస సక్సెస్ లను సాధించిన ఏ హీరో అయినా ఇక్కడ స్టార్ హీరోగా వెలుగొందవచ్చు అని చాలామంది ప్రూవ్ చేశారు. ప్రస్తుతం నాని సైతం అదే పాటిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఆయన దగ్గరికి ఒక స్టోరీ వెళ్లిందంటే చాలు ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే వస్తున్నాయి. ఇక తను ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది.
ఆయన కథల సెలెక్షన్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. అందువల్లే ఆయన ఒక్కో మెట్టు పైకెక్కుతూ వరుస సక్సెస్ లను సాధిస్తూ స్టార్ హీరో ఇమేజ్ ను అందుకోడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు… మిగతా హీరోలు రెమ్యూనరేషన్ కోసం కొన్ని సినిమాలను కమిట్ అవుతున్నారు. ఆ మూవీస్ లో సరైన కథ లేకపోవడం అలాగే కొత్తదనం లోపించడంతో డీలా పడిపోతున్నారు.
క్రమంగా వాళ్ళ మార్కెట్ తగ్గిపోతోంది. కానీ నాని మాత్రం చాలా తెలివిగా ఆలోచిస్తూ రెమ్యూనరేషన్స్ గురించి పట్టించుకోకుండా క్వాలిటి సినిమాలను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు…ఈ ఒక్క విషయాన్ని ఇప్పుడున్న యంగ్ హీరోలు తెలుసుకుంటే వాళ్లు కూడా స్టార్ హీరోలుగా మారే అవకాశాలైతే ఉన్నాయి. ఎప్పుడైతే మనం కష్టపడతామో అప్పుడే మనకు సక్సెస్ దక్కుతోంది.
ఎవరు ఎలాంటి కష్టం చేసినా కూడా ఆ సినిమాలనేవి సూపర్ సక్సెస్ అయినప్పుడే ఆ హీరోలకు మంచి ఇమేజ్ వస్తోంది. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి నానిని ఫాలో అవుతూ ఇతర హీరోలు ముందుకు సాగితే వాళ్లకు కూడా మంచి ఇమేజ్ వస్తోంది. లేకపోతే వాళ్ళ మార్కెట్ ను పూర్తిగా కోల్పోయి వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి…