దడ పుట్టిస్తున్న బంగారం ధర.. బుధవారం తులం ఎంతంటే? – Telugu News | Ndia Gold, Silver Price Hike Oct 15 Rates & Global Factors video TV9D – Business Videos in Telugu

అక్టోబర్ 15, బుధవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,30,830 రూపాయలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,21,150 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,86,200 రూపాయలుగా ఉంది.ముంబాయిలో 24 కేరట్ల తులం బంగారం ధర రూ.1,28,890గా ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,18,150గా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల తులం బంగారం ధర రూ.1,29,040కు చేరగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,18,300గా ఉంది. బెంగళూరులో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,90 గా ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,1,150గా ఉంది. చెన్నైలో 24 కేరట్ల తులం బంగారం ధర రూ.1,29,380 గా ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,18,600 గా ఉంది. కోల్‌కతా లో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,890 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.1,18,150 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ వంటి పరిణామాలు ఇన్వెస్టర్లను బంగారం వైపు ఆకర్షిస్తున్నాయి. డాలర్ విలువ పడిపోవడం కూడా ఈ పెరుగుదలపై ప్రభావం చూపుతోంది. డాలర్ బలహీనతతో బంగారం సురక్షిత పెట్టుబడిగా కనిపిస్తోంది.

 

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్… ఏకంగా వైస్ కెప్టెన్సీ ఛాన్స్‌

ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో దెబ్బే.. సర్వేలో షాకింగ్ నిజాలు

బైకుపై రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం.. ఆ తర్వాత

భారత్‌లో అప్ఘాన్ మంత్రి.. వణుకుతున్న పాక్

ఏనుగుల గుంపు బీభత్సం.. నిద్రపోతున్నవారిపై దాడి

Leave a Comment