ఢిల్లీ హై కోర్టులో హీరో హృతిక్ రోషన్ కి భారీ ఊరట..అసలు ఏమైందంటే!

ఢిల్లీ హై కోర్టులో హీరో హృతిక్ రోషన్ కి భారీ ఊరట..అసలు ఏమైందంటే!

Hrithik Roshan Delhi High Court: ప్రముఖ నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) కి ఢిల్లీ హై కోర్టు లో భారీ ఊరట లభించింది. విషయం ఏమిటంటే ఇటీవలే ఆయన తనకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలను తన అనుమతి లేకుండా ఉపయోగించుకుంటున్నారని, తన ఫోటోలకు ప్రైవసీ కావాలంటూ ఢిల్లీ హై కోర్టుని ఆశ్రయించాడు.ఈ కేసు ని విచారించిన హై కోర్టు నేడు తుది తీర్పుని ఇచ్చింది. ఇకపై హృతిక్ అనుమతి లేకుండా ఆయన వ్యక్తిగత ఫోటోలను ఉపయోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కామర్స్ వెబ్ సైట్స్ లోని హృతిక్ ఫోట్లను తక్షణమే తొలగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. హృతిక్ రోషన్ ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు కాబట్టి, ఆయన ఫోటోలను సోషల్ మీడియా లో ఉండే ఫ్యాన్ పేజెస్ ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాయి. వాళ్ళు మాత్రం హృతిక్ రోషన్ ఫోటోలను ఉపయోగించుకోవచ్చు.

అనేక ఈ కామర్స్ సైట్స్ లలో హృతిక్ రోషన్ పేరుని, ఆయన డ్యాన్స్ వీడియోలను ట్యుటోరియల్స్ పేరుతో విచ్చలవిడిగా ఉపయోగించుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారని హృతిక్ రోషన్ తరుపున న్యాయవాది కోర్టుగా తెలపగా, న్యాయస్థానం దీనిపై స్పందిస్తూ అందులో ఎలాంటి వాణిజ్య ప్రయోజనం లేదు కాబట్టి, ఉపయోగించవచ్చని తెలిపింది. ఈ ఒక్క విషయం లో మాత్రం హృతిక్ రోషన్ కి నిరాశ ఎదురైంది. ఈమధ్య కాలం లో సెలబ్రిటీలు తమ ఫోటోలను తమ అనుమతులు లేకుండా ఉపయోగించరాదని హై కోర్టుని ఆశ్రయయించడం సర్వ సాధారణం అయిపోయింది. అక్కినేని నాగార్జున, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వంటి వారు ఇది వరకు ఈ అంశంపై హై కోర్టు ని ఆశ్రయించారు. వీళ్ళ బాటలోనే హృతిక్ రోషన్ అడుగులేసి నేడు విజయం సాధించాడు. ఈమధ్య కాలం లో AI వాడకం విపరీతంగా ఉండడం, తమకు సంబంధం లేకుండానే ఫేక్ ఫోటోలు బయట ప్రచారం లో ఉండడం తో సెలబ్రిటీలు ఇలా హై కోర్టు ని ఆశ్రయిస్తున్నారని విశ్లేషకుల నుండి వినిపిస్తున్న మాట.

ఇక హృతిక్ రోషన్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆయన హీరో గా నటించిన ‘వార్ 2’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇప్పుడు ఆయన క్రిష్ 4 చిత్రం లో నటించబోతున్నాడు. అదే విధంగా త్వరలోనే ఆయన KGF, కాంతారా మేకర్స్ హోమబుల్ ఫిలిమ్స్ సంస్థ తో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Comment