Dude Collection: లవ్ టుడే, డ్రాగన్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) చేసిన చిత్రం ‘డ్యూడ్'(Dude Movie). ఈ నెల 17 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, ట్రైలర్ కి యూత్ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ చిత్రం లోని పాటలే వినిపిస్తున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో యూత్ ఆడియన్స్ రోజుకు వేల సంఖ్యలో రీల్ వీడియోస్ చేస్తున్నారు. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారంటే కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ గ్యారంటీ అనేది బలంగా ఫిక్స్ అయిపోవచ్చు. అయితే ఈ చిత్రం ప్రదీప్ నుండి రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత విడుదల అవుతుంది కాబట్టి, ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరిగింది.
డొమెస్టిక్ మార్కెట్(ఇండియా) లో తమిళ వెర్షన్ బిజినెస్ పాతిక కోట్ల రూపాయలకు పైగా జరగగా, తెలుగు వెర్షన్ థియేట్రికల్ బిజినెస్ 15 కోట్ల రూపాయలకు పైగా జరిగింది. ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉండడం తో టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది అని అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కచ్చితంగా ఈ సినిమా వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. కేవలం డొమెస్టిక్ మార్కెట్ లో మాత్రమే కాదు, ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రానికి భారీ బిజినెస్ జరిగింది. ఒక్క నార్త్ అమెరికా లోనే రెండు మిలియన్ డాలర్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఇండియన్ కరెన్సీ లెక్క ప్రకారం చూస్తే 15 కోట్ల రూపాయిలు అన్నమాట. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తమిళనాడు, ఓవర్సీస్ ప్రాంతాల్లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు, మరికొన్ని చోట్ల ఇంకా ప్రారంభించాల్సి ఉంది. రేపు సాయంత్రం లోపు తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో బుకింగ్స్ మొదలయ్యే అవకాశం ఉంది. తమిళనాడు, ఓవర్సీస్ ప్రాంతాల్లో బుకింగ్స్ అదిరిపోయాయి. ఒక్క చెన్నై సిటీ లోనే ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా పాజిటివ్ టాక్ వస్తే 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాక్ వస్తే ఫుల్ రన్ లో 200 కోట్ల గ్రాస్ ని కూడా ఈ చిత్రం రాబట్టే అవకాశాలు ఉన్నాయి.