జీఎస్టీ పండుగ కాదు జీఎస్టీ దండగ మోడీ పల్లకి మోస్తున్న చంద్రబాబు జగన్‌మోహన్‌రెడ్డి… వామపక్షపార్టీ నేతలు

విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : జీఎస్టీ పండగ కాదు జీఎస్టీ దండగ కార్యక్రమమని సీఎం చంద్రబాబునాయుడు ప్రదాని మోడీ మెహర్బాణి కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారని , రాష్ట్రంలో చంద్రబాబునాయుడు, వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డిలు ఇరువురు మోడీ పల్లకి మోస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీ రామచంద్రయ్యలు విమర్శించారు. వామపక్షపార్టీల ఆద్వర్యంలో జిల్లా పరిషత్‌ నుండి కలెక్టరేట్‌ వరకు గోబ్యాంక్‌ మోడీ అంటూ నినాదాలు చేస్తూ నల్లజెండాలతో బారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.అనంతరం కలెక్టరేట్‌ వద్ద సీపీఐ , సీపీఎం జిల్లా కార్యదర్శులు బి గిడ్డయ్య, గౌస్‌దేశాయ్‌ల అద్యక్షతన నిరసన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రదాని నరేంద్రమోడీ ని శ్రీశైలం మల్లిఖార్జునుడు కూడా క్షమించడన్నారు.మతోన్మాది మోడీని మల్లన్న సహించడన్నారు. మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఏమి సాధించారని జీఎస్టీ పండుగ చేసుకుంటున్నారని విమర్శించారు.రాయలసీమలోని పెండిరగ్‌ ప్రాజెక్టుల ని ర్మాణం చేపట్టకుండా రాయలసీమ ప్రజలను సర్వనాశనం చేశాడన్నారు.మోడీ కోసం ఒక్కరోజు రూ 300 నుండి రూ 350 కోట్లు ఖర్చుచేస్తున్నాడని , ఈ డబ్బుతో ఒక ప్రాజెక్టు నిర్మాణం చేయవచ్చన్నారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీ రామచంద్రయ్య మాట్లాడుతూ జీఎస్టీ తగి ్గంచడం వలన పేదవాళ్ళకు వరిగింది ఏమి లేదన్నారు. ఎక్కడా నిత్యావసర వస్తూవుల ధరలు తగ్గలేదన్నారు. కార్లుపై తగ్గించారు సామాన్య ప్రజలకు ఏమి ఉపయోగమో చెప్పాలని ప్రశ్నించారు.మోడీ 11సం పాలనలో నిత్యావసర వస్తూవుల ధరలు ఏమాత్రం తగ్గలేదన్నారు. సంవత్సరానికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు 20 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధరల కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. రైతులు పండిరచినపంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో మోడీ తీవ్రంగా విఫలం చెందారన్నారు. ఉల్లి, టమోటా రైతులు గిట్టుబాటు ధరలు లేక పెట్టిన పెట్టుబడులు కూడా రాక ఆప్పుల పాలైనారని తెలిపారు. జిల్లాలో పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బానకచర్ల నిర్మాణం చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు చెప్పడం దుర్మార్గమన్నారు. రాయలసీమ ప్రజలపై చిత్తశుద్ది ఉంటే గుండ్రేవుల, వేధవతి , ఆర్డీఎస్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరారు. ఇప్పటికే వలసలు ప్రారంభమైనాయన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అన్నారు. మోడీ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా, రాయలసీమ , ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా రాయలసీమ ద్రోహి అని మోడీ గో బ్యాక్‌ అని ప్రజలు మోడీకి నిరసన తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్‌ మునెప్ప, లెనిన్‌బాబు, నగర కార్యదర్శి పీ రామకృష్ణారెడ్డి, సీపీఎం నాయకులు నిర్మలమ్మ, రాముడు, రాధాకృష్ణ, ఎస్‌యూసీఐ నాయకులు నాగన్న, న్యూడెమెక్రసీ నాయకులు భాస్కర్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నభిరసూల్‌, సీపీఐ నగర సహాయ కార్యదర్శులు చంద్రశేఖర్‌, శ్రీనివాసరావు, మహేష్‌, మహిళా సమాఖ్య జిల్లా అద్యక్ష కార్య దర్శులు గిడ్డమ్మ, శ్రావణి, నగర కార్యదర్శి భారతి,ఏఐటీయూసీ నగర అద్యక్షులు వెంకటేష్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు శరత్‌ వామపక్షపార్టీలకు చెందిన వివిధ ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment