గుజరాత్ చూడాలనుకునే వారు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. తెలుగు రాష్ట్రాల నుంచి.. – Telugu News | IRCTC Bharat Gaurav: Bhavya Gujarat Tour Package 9N/10D from Renigunta

ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట రైల్వే స్టేషన్ నుండి భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు భవ్య గుజరాత్ ప్యాకేజ్ (9 రాత్రులు / 10 రోజులు) కోసం బయలుదేరుతుంది. ఈ రైలు 2025 అక్టోబర్ 27న సికింద్రాబాద్ ఉదయం 8 గంటలకు, నిజామాబాద్ ఉదయం 11:30 గంటలకు, నాందేడ్ మధ్యాహ్నం 02:00 గంటలకు, పూర్ణా జంక్షన్ మధ్యాహ్నం 02:50 గంటలకు చేరుకుంటుంది.

గమ్యస్థానాలు, సందర్శనీయ ప్రదేశాలు

  • ద్వారకా: ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర ఆలయం, బేట్ ద్వారకా
  • సోమనాథ్: సోమనాథ్ ఆలయం
  • అహ్మదాబాద్: సబర్మతి ఆశ్రమం, మోడేరా సూర్యదేవాలయం (మోడేరా), రాణి కి వావ్ (పటాన్)
  • ఎకతా నగర్: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ

ప్రయాణ మార్గం: రేణిగుంట నుండి బయలుదేరి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, విజయవాడ, ఖమ్మం, కాజీపేట్, సికింద్రాబాద్ జంక్షన్, నిజామాబాద్ జంక్షన్, హజూర్ సాహెబ్ నాందేడ్, పూర్ణా జంక్షన్ మీదుగా ప్రయాణిస్తుంది.

ప్యాకేజ్ ధరలు:

  • Economy (SL): రూ.18,400
  • Standard (3AC) : రూ.₹30,200
  • Comfort (2AC) : రూ.39,900

సౌకర్యాలు: రోజుకు మూడు భోజనాలు, వసతి, రవాణా సదుపాయం, ప్రతి బోగీలో IRCTC సిబ్బంది అందుబాటులో ఉంటారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని IRCTC కోరుకుంటుంది. మరిన్ని వివరాలకు
వెబ్‌సైట్ www.irctctourism.com, 9701360701, 9281030749, 9281030750, 9281495843 నంబర్లను సంప్రదించవచ్చు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Leave a Comment