టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఒకరి తర్వాత ఒకరిగా అన్నట్లుగా టెస్టులు, టి-20ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం వీరిద్దరు వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్నారు. త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే వన్డే సిరీస్‌లో రో-కోల జోడి తమ ఆటతో అభిమానులను అలరించనున్నారు. అయితే ఈ సిరీస్ తర్వాత తమకు బ్యాడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉందనే సోషల్‌మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఈ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్‌లు వన్డేల నుంచి కూడా రిటైర్ అవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే దీనిపై బిసిసిఐ రియాక్ట్ అయింది. ఢిల్లీలో మంగళవారం బిసిసిఐ ఉపాధ్యక్షఉలు రాజీశ్ శుక్లా మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో రో- కో వన్డే రిటైర్మెంట్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వాళ్లిద్దరు జట్టులో ఉండటం మాకు అతిపెద్ద సానుకూలాంశం. ఇద్దరూ గొప్ప బ్యాటర్లు. వారిద్దరి సమక్షంలో టీమిండియా కచ్చితంగా ఆస్ట్రేలియాను ఓడించి తీరుతుంది. రో-కో లకు ఇదే చివరి సిరీస్ అనడం హాస్యాస్పదం. అసలు మేము ఈ విషయం గురించి ఆలోచించము. రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం. ఏదేమైనా రోహిత్- కోహ్లికు ఆసీస్ సిరీస్ ఆఖరిది అనడం తప్పు’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు.