‘ఓజీ’ 20 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..

OG 20 Days Collections: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం విడుదలై దాదాపుగా నేటి తో మూడు వారాలు పూర్తి అయ్యింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ ఈ చిత్రం స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. పవన్ కళ్యాణ్ సినిమాకు ఇలా మూడవ వారం లో కూడా థియేట్రికల్ రన్ రావడం జరిగి 12 ఏళ్ళు అయ్యింది. మధ్యలో వకీల్ సాబ్ చిత్రానికి మంచి థియేట్రికల్ రన్ వచ్చేది కానీ, కరోనా మహమ్మారి విలయతాండవం ఆడడంతో కేవలం 10 రోజులకే థియేటర్స్ ని మూసి వేయాల్సి వచ్చేది. లేదంటే ఓజీ చిత్రం కంటే మంచి థియేట్రికల్ లాంగ్ రన్ వచ్చేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా 20 రోజుల్లో ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది?, రాబోయే రోజుల్లో ఇంకా ఎంత వసూళ్లను రాబట్టే అవకాశం ఉండి అనేది ఇప్పుడు మనం స్పష్టంగా చూడబోతున్నాము.

ఒక ప్రాంతీయ బాషా చిత్రానికి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం సాధారణమైన విషయం కాదు. మన తెలుగు లో అయితే ఓజీ చిత్రం తప్ప మరో సినిమా లేదు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసే స్కోప్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకో నిర్మాతలు ఆ దిశగా అడుగులు వేయలేదు. కేవలం తెలుగు మీదనే ఫోకస్ పెట్టారు. హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా విడుదలైంది కానీ, అది చాలా లిమిటెడ్ రిలీజ్ అనే అనుకోవాలి. అక్కడి నుండి వచ్చిన వసూళ్లు కూడా అంతంత మాత్రమే. ప్రస్తుతానికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 308 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 10 సినిమాల జాబితా లో ఈ చిత్రం కూడా ఒకటిగా నిలిచిపోయింది.

ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే, నైజాం నుండి 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతం నుండి 18 కోట్లు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 16 కోట్ల 40 లక్షలు, తూర్పు గోదావరి జిల్లా నుండి 12 కోట్ల 20 లక్షలు, పశ్చిమ గోదావరి నుండి 8 కోట్ల 30 లక్షలు, గుంటూరు నుండి 11 కోట్లు, కృష్ణ జిల్లా నుండి 9 కోట్ల 70 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 4 కోట్ల 80 లక్షలు, కర్ణాటక ప్రాంతం నుండి 11 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల 30 లక్షలు, ఓవర్సీస్ నుండి 33 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 183.7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 308 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. క్లోజింగ్ లో ఇంకా ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.

Leave a Comment