ఇస్లామాబాద్ : పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వాల మధ్య తాత్కాలికంగా 48 గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమలు లోకి వచ్చింది. ఉభయ దేశాల మధ్య తాజాగా సంఘర్షణలు చెలరేగి ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ ఒప్పందంపై ప్రకటించింది. సానుకూల పరిష్కారం కోసం ఉభయ దేశాలు విశ్వసనీయమైన ప్రయత్నాలు చేయడానికి అంగీకరించాయి. ఈ తాత్కాలిక కాల్పుల విరమణ వల్ల దౌత్యపరమైన చర్చలకు వీలవడమే కాక, తదుపరి ప్రాణనష్టం జరగకుండా నివారించడం సాధ్యమవుతుందని పాక్ విదేశీ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
