
మేష రాశి:
విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మిథున రాశి:
ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
కర్కాటక రాశి:
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. ఆకస్మిక లాభాలు ఉంటాయి.
సింహ రాశి:
ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
కన్యా రాశి:
గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడపాల్సి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
వృషభ రాశి:
ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అవలీలగా అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. ఉద్యోగులకు మిశ్రమ సమయం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సన్నిహితుల నుంచి ఆర్థిక లబ్ధి ఉండవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
తులా రాశి:
ఇతరులకు హాని తలపెట్టే పనులకు దూరంగా ఉంటారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. కొత్త పనులకు ఆటంకాలేర్పడతాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకుని సహనంగా ఉంటే మంచిది. మీ దురుసుతనం వల్ల ఇతరులు ఇబ్బందులను ఎదుర్కొంటారు.
వృశ్చిక రాశి:
వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.
ధనుస్సు రాశి:
కుటుంబ కలహాలు దూరమవుతాయి. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.
మకర రాశి:
కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ప్రయత్నకార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
కుంభ రాశి:
నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడటం మంచిది.
మీన రాశి:
కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.