రెమ్యూనరేషన్స్ భారీగా పెంచుతున్న కుర్ర హీరోలు…

Young heroes remunerations: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కుర్ర హీరోల హవా ఎక్కువైపోతోంది. చిన్న సినిమాలతో మంచి విజయాలను సాధించి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటున్నారు. స్టార్ హీరోలు భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తుంటే కుర్ర హీరోలు చిన్న బడ్జెట్లో సినిమాలను చేసి భారీ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక యంగ్ హీరోలందరు ఒక్క సినిమా సూపర్ సక్సెస్ అవ్వగానే వాళ్ళు రెమ్యునరేషన్ ని భారీగా పెంచేస్తున్నారు. లిటిల్ హార్ట్స్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మౌళి మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొట్టాడు. కాబట్టి తన తదుపరి సినిమాకి కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుఅయింది. మొదటి సినిమా కోసం ఆయన 10 లక్షల రెమ్యునరేషన్ ను మాత్రమే తీసుకున్నాడు. ఇక రెండోవ సినిమాకి తన రెమ్యూనరేషన్ పది రేట్లు పెంచడం కొంతవరకు ప్రొడ్యూసర్లకు ఇబ్బందిగా మారిందనే చెప్పాలి… శ్రీ విష్ణు లాంటి హీరో సైతం వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. కాబట్టి ఆయన రెమ్యూనరేషన్ భారీగా పెంచాలనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మొదట్లో 2 కోట్లు తీసుకున్న ఆయన ఇప్పుడు 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండటం విశేషం…

ఇప్పటికే సినిమాల బడ్జెట్ భారీగా పెరిగిపోతుందని చాలామంది చిన్న నిర్మాతలు కంగారు పడుతున్నారు. ఇక పెద్ద హీరోలు చేసే సినిమాల బడ్జెట్ పెరిగిన వాళ్ల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అలాగే వాళ్ళ సినిమాలను తమ అభిమానులు ఒకటికి రెండుసార్లు చూసి కలెక్షన్స్ ను పెంచే దిశగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇక హీరోల పరిస్థితి అలా కాదు.

వాళ్ల సినిమాకి సక్సెస్ ఫుల్ టాక్ వస్తేనే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు. లేకపోతే సినిమాను ఎవరు పట్టించుకోరు పొరపాటున సినిమా డిజాస్టర్ అయితే మాత్రం ప్రొడ్యూసర్లు భారీగా నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అలాగే వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి రావచ్చు.

అందువల్లే కుర్ర హీరోలు కొన్ని మంచి సినిమాలను చేస్తూ స్టెప్ బై స్టెప్ రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళ్తే బాగుంటుంది. అంతే తప్ప ఒకటి రెండు సక్సెసులు పడగానే రెమ్యునరేషన్ ను 10 రేట్లు, 20 రేట్లు పెంచడం సమంజసం కాదని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

Leave a Comment